ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య పోటీ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వీరి మధ్య ఈ రేంజ్లో పోటీ ఏర్పడడానికి రాజకీయంగా దుమ్ము రేగడానికి పరోక్షం గా పనిచేసిన సంస్థలు.. రాజకీయ,ఎన్నికల వ్యూహకర్తలే. టీడీపీకి రాబిన్ శర్మ బృందం పనిచేసింది. ఎన్ని కలకు మూడు సంవత్సరాల ముందు నుంచే టీడీపీని పరుగులు పెట్టించేలా కార్యక్రమాలు రూపొందించి .. జోరు పెంచి.. జోష్ వచ్చేలా చేసింది.
ఈ కారణంగానే బాదుడే -బాదుడు కార్యక్రమాలు, నిజం గెలవాలి యాత్రలు వంటివి తెరమీదికి వచ్చాయి. ఇదేసమయంలో టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయా త్ర కూడా.. సక్సెస్ అయింది. మొత్తానికి అపర చాణిక్యుడు వంటి చంద్రబాబును మరింత పరుగులు పెట్టించడంలోనూ.. వైసీపీ దూకుడు కళ్లెం వేసేలా కార్యక్రమాలు రూపొందించడంలోనూ.. రాబిన శర్మ.. బృందం సక్సెస్ అయింది.
రాబిన్ శర్మ విజయం ఏ రేంజ్లో ఉంటుందో.. తాజాగా వచ్చిన ఫలితాలు స్పష్టం చేశాయి. ఇక, ఈ విజ యం తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారనికి వచ్చిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. రాబిన్ శర్మను పట్టుకుపోయారు. వచ్చే ఏడాది మహారాష్ట్రలో ఎన్నికలు ఉండడంతో ఆయనను తనతో తీసుకువెళ్లి.. వ్యూహకర్తగా నియమించుకున్నారు. దీంతో ఇక్కడ రాబిన్ బృందం.. షో టైం గ్రూప్‌గా ఏర్పడింది. రానున్న నాలుగేళ్లపాటు.. టీడీపీ బలోపేతానికి ఈ బృందం పనిచేయనుంది.
ఇదిలావుంటే.. వైసీపీకి కూడా ఐప్యాక్ బృందం వ్యూహకర్తగా పనిచేసింది. గత ఐదేళ్లపాటు ప్రభుత్వ పథకాల అమ లు తీరు, నాయకుల మార్పు, టికెట్ల మార్పు ఇలా అనేక రూపాల్లో ఈ బృందం కూడా సేవలు అందించింది. అయితే.. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఈ బృందం రాష్ట్రం నుంచివెళ్లిపోయింది. దీంతో జగన్ ఇప్పుడు కొత్త వారి కోసం వేటాడుతున్నారు. ఇదీ పరిస్థితి!!