ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతలు దండిగా ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. కానీ, వీరిలో లేనిదల్లా ఐక్యతేనని అంటున్నారు పరిశీలకులు. ఎక్కడికక్కడ నాయకులు విమర్శలు చేసుకుంటున్నా రు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తు న్నా.. నాయకులు మాత్రం మారడం లేదు. వారిలో వారు తన్నుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి దన్ను లభించకపోవడమేనని అంటున్నారు.
దీంతో అవకాశం ఉన్న చోటల్లా సంపాయించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనే విమ ర్శలు తరచుగా వినిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో ఖర్చు ఎక్కువ పెట్టుకున్న వారు.. వచ్చే ఎన్ని కల్లో పోటీకి రెడీ అవుతున్నవారు.. కూడా.. నాయకులు సంపాయించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఈ క్రమంలోనే నేతల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోని.. నాయకుల మధ్య జరిగిన వివాదాలను పరిశీలిస్తే.. ఇదే విషయం తెరమీదికి వచ్చిం ది.
అయితే.. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా.. అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఎక్కడికక్కడ నాయకుల బలం కన్నా.. వారు సాగిస్తున్న దందాల కారణంగానే పార్టీ పరువు పోతోందనే వాదన వినిపిస్తోంది.ఈ క్రమంలో పార్టీ నేతలను హెచ్చరించడం వరకే పార్టీ పరిమితం అవు తోంది తప్ప.. క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇలా తీసుకుంటే.. నేతల మధ్యమరింత వివాదాలు పెంచిపోషించినట్టు అవుతుందని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైసీపీ నేతల మధ్య సఖ్యత ఉండాలనేది పరిశీలకులు చెబుతున్న వాదన. అయితే.. ఆదిశగా నాయకులు కానీ.. అధిష్టానం కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి చర్య లు తీసుకోకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే..పార్టీకి కష్టమనే అభిప్రాయం వైసీపీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకపై అయినా.. పార్టీ నాయకులను కట్టడి చేసేందుకుఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.