సిలికాన్ వ్యాలీ లో దేశీ యువత ని క్రమం తప్పకుండా విన్నూత వీకెండ్ ఫన్ తో ఉర్రూతలూగిస్తున్న’ఇన్ని ఎంటర్టైన్మెంట్స్’ ఈ సారి దేశ రాజధాని పై కన్నేసింది. అమెరికన్ ఇండిపెండెన్స్ డే థీమ్ తో, వాషింగ్టన్ దేశీ నైట్ పేరుతో బాలీవుడ్ భాంగ్రా/సౌత్ ఇండియన్ బీట్స్ అనే డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
వాషింగ్టన్ డీసీ లో ఇలాంటి దేశీ డాన్స్ కొత్త కావడంతో యువతి యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఉల్లాసంగా గడిపారు.
మేజర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అడవి శేషు, ప్రముఖ యాంకర్ రవి, నటుడు ధనరాజ్, తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, తానా 2023 ఫిలడెల్ఫియా కాన్ఫరెన్స్ కి కన్వీనర్ గా నియమితులైన రవి పొట్లూరి, తానా కౌన్సిలర్ – ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు కొణెదల, TV9 NJ రిపోర్టర్ ఉజ్వల్ కస్తాల తదితరులు పాల్గొన్నారు.
ఇన్ని ఎంటర్టైన్మెంట్ అధినేత్రి ప్రసన్న మాట్లాడుతూ, వాషింగ్టన్ డీసీ యువత నుండి అనూహ్య స్పందన వచ్చిందని, దేశం లోని అన్ని ప్రముఖ నగరాలలో ఇలాంటి తరహా కార్యక్రమాలకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.