• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆస్ట్రేలియాలో హత్య చేసిన నాలుగేళ్లకు ఢిల్లీలో దొరికాడు

admin by admin
November 28, 2022
in India, Top Stories
0
0
SHARES
126
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇంట్లో భార్యతో తగువు ఏమిటి? ఆస్ట్రేలియాలో మహిళను అత్యంత దారుణంగా చంపేయటం ఏమిటి? అలాంటోడు నాలుగేళ్లకు ఢిల్లీలో దొరకటం ఏమిటి? అసలేమైనా లింకులు ఉన్నాయా? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. వీటన్నింటికి ఒక లింకు ఉంది. దాని గురించి తెలిస్తే ఇలా కూడా చేస్తారా? అన్న సందేహం కలుగక మానదు. రీల్ కథకు ఏ మాత్రం తగ్గని ట్విస్టులతో ఉన్న ఈ దారుణ నేరం గురించి పూర్తిగా చదవాలంటే నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక్కొక్క ఘటన గురించి తెలుసుకోవాల్సిందే.

నాలుగేళ్ల క్రితం.. మరింత సరిగ్గా చెప్పాలంటే 2018 అక్టోబరు 21న ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ కనిపించకుండా పోయారు. ఆమెను వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆమెను.. బీచ్ లోని ఇసుక కింద కప్పి పెట్టినట్లుగా గుర్తించారు. అత్యంత పాశవికంగా ఆమెకు హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. ఆమె పెంపుడు కుక్క అక్కడి దగ్గర్లోని చెట్టుకు కట్టేసి ఉంచారు.

ఉన్మాదంతో కూడిన దారుణ హత్యగా గుర్తించిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత రాజ్విందర్ అనే వ్యక్తి (నర్సుగా పని చేస్తుంటాడు) మీద అనుమానం వ్యక్తమైంది. అతడి గురించి ఆరా తీయగా హత్యకు గురైన 48 గంటల వ్యవధిలోనే భార్య పిల్లల్ని తీసుకొని దేశం విడిచిపెట్టి వెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో.. అతడి మీద అనుమానం మరింత పెరిగింది. అతడి కోసం.. అతడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది.

దీంతో రాజ్విందర్ ఆచూకీ తెలిపిన వారికి రూ.5.5కోట్ల బహుమతి ఇస్తామని కూడా క్వీన్స్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఢిల్లీలోని జీటీ కర్నల్ రోడ్డు లో ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడి గురించి ఆరా తీసి.. తాము వెతుకుతున్న రాజ్విందర్.. తాము అదుపులోకి తీసుకున్న నిందితుడు ఒకరేనని ధ్రువీకరించారు. అనంతరం అతడ్ని విచారించగా.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

బీచ్ లో మహిళను తాను ఎందుకు హత్య చేశానన్న విషయాన్ని చెప్పుకొచ్చిన రాజ్విందర్.. ‘‘ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసేవాడిని. ఒకరోజు భార్యతో గొడవైంది. ఆ కోపంలో కత్తి.. కొన్ని పండ్లు తీసుకొని రిలాక్స్ అయ్యేందుకు దగ్గర్లోని బీచ్ కు వెల్లాను. అప్పుడే తోయా కార్డింగ్లీ తన పెంపుడు కుక్కను తీసుుకొచ్చింది. ఆ కుక్క నన్ను చేసి అదే పనిగా అరవసాగింది. భార్యతో గొడవ పడిన చిరాకులో ఉన్నా. దీంతో ఆమెతో వాగ్వాదం జరిగింది. అది పెరిగి పెరిగి పెద్దదై.. చివరకు తన వెంట ఉన్న కత్తితో ఆమెను దారుణంగా చంపేశా’’ అని పేర్కొన్నారు.

ఆమెను హత్య చేసిన అనంతరం.. ఆమెను తీసుకెళ్లి ఇసుక కింద కప్పేసి.. పాతి పెట్టినట్లుగా చెప్పాడు. అనంతరం కుక్కను పట్టుకొని చెట్టుకు వేలాడదీసి కట్టేశానని చెప్పాడు. రక్తపు మరకలు ఉన్న కత్తిని నీళ్లలో పడేసి ఇంటికి వెళ్లానని.. అక్కడి నుంచి కుటుంబాన్ని తీసుకొని భారత్ కు వచ్చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత భార్యను, తల్లిదండ్రుల్ని వదిలేసి పంజాబ్ – ఢిల్లీ మధ్యన మార్చి మార్చి తిరుగుతుండేవాడినని చెప్పాడు. ఎవరూ తనను గుర్తు పట్టకూడదన్న ఉద్దేశంతో తన మీసం.. గడ్డాన్ని బాగా పెంచేయటంతో అతడ్ని గుర్తించటానికి వీల్లేకుండా పోయింది. అయినప్పటికీ అతడ్ని అదుపులోకి తీసుకోవటంలో పోలీసులు విజయం సాధించారు. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్ట్రేలియా పోలీసులకు అప్పజెప్పనున్నారు.

Tags: arrested in delhiaustralian girlfour yearsindian guymurder at beach
Previous Post

అమరావతి :జగన్ కు సుప్రీం షాక్

Next Post

అమరావతి రైతులకు సుప్రీంలో చుక్కెదురైనట్లేనా?

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

అమరావతి రైతులకు సుప్రీంలో చుక్కెదురైనట్లేనా?

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra