అవును! కడప జిల్లాలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎక్కడ నిలబడ్డా వినిపిస్తున్న మాట ఇదే! మా భూ ములు లాగేసుకున్నారనో.. మా భూములు కబ్జా చేసేశారనో.. మాకు నిలువ నీడకూడా లేకుండా చేశారనో.. ని నాదాలే వినిపిస్తున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఇలా వినిపించడం ఇదే తొలిసారి కావడం గమ నార్హం. గతంలో జగన్ తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. ఇంతలా ఎక్కడా వినిపించలేదు. ఏదో ఒకరిద్దరు అవినీతి చేసినా.. వైఎస్ ఎక్కడికక్కడ చర్యలు తీసుకుని.. తన ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకున్నారనే పేరుంది. కానీ.. ఇప్పుడు సీఎం జగన్ ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదు కదా.. అలాంటి విమర్శలను ఆయ న ప్రతిపక్షాల ఖాతాలో వేస్తున్నారే తప్ప.. వాస్తవాలు తెలుసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే.. ప్రధానంగా 5 నియోజకవర్గాల్లో నేతలు రెచ్చిపోతున్నారనే టాక్ బాహాటంగానే వినిపిస్తోం ది. కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట, మైదుకూరు, కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో భూకబ్జాల ను ఇష్టానుసారం చేస్తున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అదేసమయంలో ఆయా నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. కమలాపురంలో జగన్ సమీప బంధువు కనుసన్నల్లోనే భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆఖరుకు డీ పట్టాలున్నాయని చెబుతున్నా.. బాధితుల మాట వినిపించుకునే నాథుడు కనిపించడం లేదు. ఇక, కడప నగరంలో ఏకంగా.. ఓ రాజకీయ నేత భూములనే ఆక్రమించారు. ఈ విషయం వివాదం అయితే.. ఇంటికి పిలిచి బెదిరించారని కూడా వార్తలు వచ్చాయి.
మరీముఖ్యంగా మైదుకూరులో అయితే.. వైసీపీ నాయకులకు, అడ్డు అదుపు లేకుండా పోయింది ఇక్కడ అటవీ భూములను వంద ఎకరాలకు పైగా ఆక్రమించేసి. అధికారులతో కుమ్మక్కయి… రాత్రికి రాత్రి పట్టాలు పుట్టించేశారు. ఇది ఎలా సాధ్యమైందంటే.. ఉన్నత స్థాయిలో చక్రం తిరుగుతోందని అంటున్నారు. ఇక, జమ్మలమడుగులో ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా చేసేసి.. పేదల భూములను ఆక్రమించారనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి అనుచరులు బంధువులు అని చెప్పుకుంటూ కొందరు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్నాయని అంటున్నా.. ఆయన మాత్రం నాకు సంబంధం లేదని చెబుతున్నారే తప్ప.. విచారణకు ఆదేశించాలని మాత్రం కోరకపోవడం గమనార్హం.
సరే! ఇంతలా ఎందుకు జరుగుతోంది? నాయకులు ఎందుకు రెచ్చిపోతున్నారు? పోనీ నాయకులు రెచ్చిపోతుంటే.. సీఎం జగన్ ఎందుకు ఊరుకుంటున్నారు? అనేవి కామన్‌గా వచ్చే ప్రశ్నలు. వీటికి సమాధానం.. సీఎం జగన్ తన సొంత జిల్లాను గ్రేటర్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం చేయడం, దీనికి సంబంధించి నిధులు పారించడం,.. ఎక్కడ చూసినా.. అభివృద్ధి పుంజుకోవడం, ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం .. మరో రెండేళ్లలో పూర్తికావడం వంటివి కబ్జాలకు బీజం వేశాయి. మరి జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారంటే.. ప్రతిపక్షాలను ఎదగనివ్వకుండా చేయాలంటే.. తన వారు బలంగా ఉండాలనే ఏకైక దురాశ తప్ప మరేమీ కాదనేది ఇక్కడి వారు చెబుతున్నారు. వెరసి కడప ప్రజలు నరకం చూస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.