ఇది అమ్మాయిల కాలం.
వాళ్లలో మార్పు మగమహానుభావులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.
మొహమాటపడటం, భయపడటం మానేశారు అమ్మాయిలు
అబ్బాయిల కంటే ధైర్యంగా మనసులో మాట చెప్పేస్తున్నారు
తాజా సంఘటన వాటన్నిటికీ పీక్స్
ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యే ఒకరికి పంజాబ్ కు చెందిన యువతి వెరైటీగా ప్రపోజ్ చేసింది
ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పోస్టుకు సదరు ఎమ్మెల్యే కూడా స్పందించటం.. ఇంకో ట్విస్ట్.
ఆమ్ ఆద్మీ పార్టీ.. తన అధికారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ఆశిస్తోంది.
త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్ లో గెలిస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది.
‘నాకు ఉచిత విద్యుద్ వద్దు. రాఘవ్ కావాలి’ అంటూ ఒకమ్మాయి పోస్టు పెట్టింది.
రాఘవ్ అంటే… ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యంత పిన్న వయస్కుడు, అందగాడైన ఎమ్మెల్యే రాఘవ్ చద్దా
32 ఏళ్ల రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజేందర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే.
అతను ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి.. అందులో సదరు యువతి వివరాల్ని కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని ఇన్ స్టాలో పోస్టు చేశాడు
‘పార్టీ మేనిఫెస్టోలో నేను లేను. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేట్లు చూస్తాలే’ అని బదులిచ్చారు. అయితే.. రాఘవ్ రిప్లై తర్వాత సదరు యువతి తన ట్వీట్ ను ట్విటర్ నుంచి తొలగించింది. ఏమైనా..ఆప్ ఎమ్మెల్యే కు సరదాగా ప్రపోజ్ చేసిన యువతి వ్యహారం అందరిని ఆకర్షిస్తోంది.
https://twitter.com/bawari_kudi/status/1421481450222743559
మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
59 మంది గెలిస్తే అధికారం దక్కించుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చిన హామీని ఈ అమ్మాయి భలే ప్రచారం చేసిందనే చెప్పాలి.