నాగ చైతన్య – సమంత విడాకుల వ్యవహారం ఇంకా చల్లబడలేదు.
దీనిపై అక్కినేని కుటుంబం అన్నిటినీ ఇగ్నోర్ చేస్తూ సైలెంట్ గా ఉంది.
కానీ సమంత మాత్రం దానిని నిరంతరం చర్చలో పెడుతోంది.
ఎవరో కొందరు ఏవో కామెంట్లు చేస్తే తనపై వచ్చిన ఆరోపణలను సమంత తనే ప్రమోట్ చేస్తోంది.
ఎవరికీ తెలియని విషయాలను సమంతే అందరికీ చెబుతోంది. దీంతో సమంతపై కొద్ది మంది చేసిన ఆరోపణలు అందరికీ తెలిశాయి.
ఇంతకీ సమంత ఏమంది అంటే…
నేను డైవోర్స్ బాధలో ఉన్నాను.. విడిపోవడం ఎంతో బాధతో కూడినది.. ఇలాంటి బాధాకర సమయంలో నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు
నాకు ఎఫైర్స్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు, నేను పిల్లల్ని వద్దనుకున్నానని ప్రచారం చేశారు, నన్ను అవకాశవాదినని అన్నారు, నాకు అబార్షన్లు అయ్యాయని ప్రచారం చేశారు
విడాకులు చాలా బాధతో కూడుకున్న నిర్ణయం… ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇలాంటి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు
–సమంత
— Samantha (@Samanthaprabhu2) October 8, 2021
ఇకపై కూడా సమంత ఇలాగే అన్నటికి రెస్పాండ్ అవుతూ పోతే సమంత కెరీర్ కు త్వరలో బ్రేకులు పడే అవకాశం లేకపోలేదు.
విడాకులతో బాధపడుతున్నాను అని సమంత అంటోంది. నిజానికి కాపురంలో ఎవరో ఒకరురాజీపడినా కాపురం నిలబడుతుంది.
కానీ సమంత విడాకులకు ఓకే చెప్పింది, కానీ బాధపడుతున్నాను అని చెప్పింది. మరి ఏది నిజమో ఆమెకే తెలియాలి.
ఈ విషయం ఎంతకాలం చర్చలో ఉంటే అంత నష్టం సమంతకే. కాబట్టి దీనిని ఇగ్నోర్ చేస్తూ పోవడం సమంతకు ఉత్తమం. మరి ఏం చేస్తుందో చూడాలి.