మంత్రి అంటే.. ఒకింత పరిజ్ఞానం.. మరింత.. అవగాహన ఉండాల్సిందే. లేకపోతే.. ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలతో తెలియక నానాతంటాలు పడాల్సిందే. ఇప్పుడు ఇలాంటి తంటాలే పడుతున్నారట.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి వర్యులు. కీలకమైన విషయాలు చర్చకు వచ్చినప్పుడు.. అంతా పీఏనే చూసుకుంటారు.. అంటూ.. సదరు మంత్రి దాట వేస్తున్నారట. దీనికి కారణం.. సదరు మంత్రికి శాఖపై పట్టు లేకపోవడమేనని అంటున్నారు. ఇటీవల బ్రిటన్ నుంచి ఒక బృందం వచ్చింది.
ఏపీలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి అధ్యయనం చేసేందుకు వచ్చిన ఈ బృం దం పర్యటన ఆఖరులో జగనన్న పేదలందరికీ ఇళ్లు.. (Jagananna Poor People Housing Scheme) పథకం గురించి తెలుసుకుని.. సదరు శాఖలో మంత్రిని భేటీ అయింది.
అయితే.. ఆ మంత్రి వర్యులు కొన్ని వివరా లు చెప్పినప్పటికీ ఇంగ్లీష్ రాని కారణంగా కమ్యూనికేషన్ దెబ్బతింది. దీంతో ఒకింత ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన సమావేశాన్ని ఎలాగోలా.. మమ అనిపించేశారు. అయితే.. ఈ విషయం శాఖలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.
ఇదిలావుంటే, సొంత జిల్లాలోనూ.. మంత్రి గారు పెద్దగా ఏమీ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో అంతా కూడా పీఏనే చూసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏ పనికావాలన్నా.. పీఏను పట్టుకుంటే అయిపోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.
వాస్తవానికి ఒక పిఏ కాకుండా.. ఏకంగా నలుగురు పీఏలు ఉన్నారు. దీంతో ఈ విషయం తెలిసిన వారు ఎవరిని పట్టుకుంటే పని అవుతుందనే చర్చ చేస్తున్నారు. వాస్తవానికి ఒకప్పుడు ఈ మాట వినిపించేది. పీఏను పట్టుకుంటే పని అవుతుందని. కానీ, ఇప్పుడు.. మంత్రి గారి వ్యవహారం అంతా కూడా పీఏతోనే ముడి పడడంతో జిల్లా వ్యాప్తంగా.,. ఇదే చర్చ సాగుతోంది.
“మనకే అన్నీ తెలుసు అనుకునే బాపతు కాదు. కొన్ని కొన్ని సార్లు మనోళ్లు చెప్పింది కూడా వినాలి. పీఏ మనోడే. ఆయన బాగా చదువుకున్నాడు. తప్పేంటి ? తెలియని దాంట్లో వేలు పెట్టి మాట అనిపించుకో వడం ఎందుకు..? పీఏ చూస్తే.. తప్పేముంది?“ అని తనను తాను సమర్థించుకునే ఈ మంత్రి వర్యులు.. ప్రత్యేకంగా నిలిచారు.
అఫ్ కోర్స్.. దాదాపు సగం మంది మంత్రులు ఇదే బాపతని.. మంత్రి వర్గంలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. అయితే.. వారందరిలోకీ.. బయటపడుతున్న మంత్రి ఈయనే కావడం గమనార్హం. అందుకే ఈ యన మరింతగా చర్చలోకి వస్తున్నారు.. అంతే! అంటున్నారు పరిశీలకులు.