అమరావతి నుంచి రాజధాని కదిలించే ఉద్దేశం జగన్ కి లేదు. కదిలించే అవకాశం కూడా లేనన్ని న్యాయ చిక్కుుముడులు ఉన్నాయి. అయినా ఎందుకు జగన్ దానిని కెలికాడో చాలా తక్కువ మందికే తెలుసు.
ఈసారి ఉత్తరాంధ్రలో బాగా ఓట్లొచ్చాయి. మళ్లీ వచ్చే అసెంబ్లీలో గెలవడానికి వేరే ఏ ఛాన్సు లేదు. కాబట్టి రాని రాజధాని గురించి ఆశలు రేపి చంద్రబాబును శత్రువుగా చూపిస్తే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ను గెలవచ్చు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గుంటూరు కృష్ణా ఓట్లు రావు. కాబట్టి వాటి గురించి వృథా ప్రయాస ఎందుకు. గోదావరి జిల్లాలలో కులాన్ని చీల్చడానికి బీజేపీ, జనసేన ఎలాగూ వైసీపీకి సాయం చేయబోతున్నాయి. కాబట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టించి వచ్చే 2024 లో అందలం ఎక్కితే చాలు. ఎందుకంటే అభివృద్ధితో వచ్చే ఎన్నికలు గెలిచే పరిస్థితి జగన్ కి లేదని అందరికీ అర్థమైంది.
అయితే… జగన్ ప్లాన్ పటాపంచలు చేస్తూ విశాఖ ఉక్కు జగన్ గొంతులో పడింది. దీంతో రాజధాని గేమ్ ప్లాన్ తో గెలుచుకున్న ఉత్తరాంధ్రను విశాఖ ఉక్కు పోగొట్టేలా ఉంది. అందుకే తనే స్వయంగా పోస్కో వాళ్లతే మాట్లాడి చేసుకున్న ఒప్పందాలు రివర్స్ అయ్యే సరికి తలపట్టుకున్నాడు వైసీపీ అధినేత.
ఈ క్రమంలో వైజాగ్ ఓట్లను సామ దాన బేధ దండోపాయాలతో కోట్లతో, నోట్లతో దక్కించుకుంటే విశాఖ ఉక్కుకు గవర్నమెంటు డబ్బులతో సమాధి చేసి పరోక్షంగా తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారట జగన్.
విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ పార్టీ కనుక గెలిస్తే విశాఖ ఉక్కు కు ఇక శాశ్వత సమాధే అంటున్నారు ప్రముఖ పాత్రికేయుడు ఆర్కే. అది ఎలాగో ఆయన విశ్లేషణ చూడండి.