wiral: జగన్ డైలాగ్స్... నాడు, నేడు !!
తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ ప్రామిస్ లు చూస్తే జనం కోసమే జగన్ పుట్టాడా.. అన్నట్లుండేవి. కేంద్రం మెడలు వంచుతాను అన్న ఆ వీరుడు నేడు సాగిల పడి కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి జై బోలో మోడీ మారాజ్ కి అంటున్నారు.
అసలు జగన్ అపుడు ఏమనేవాడు
ఇపుడు ఏమంటున్నాడు
అని పరిశీలిస్తే.... జగన్ ఎంత దారుణంగా మాట తప్పుతాడో, మడప తిప్పుతాడో అర్థమవుతుంది.
జగన్ నాడు - ప్రత్యేక హోదా పై కేంద్రం మెడలు వంచుతా
జగన్ నేడు - ప్లీజ్ సార్, ప్లీజ్ అంటూ వేడుకుంటా
నాడు - సన్న బియ్యం పంపిణీ చేస్తాం
నేడు - సన్న బియ్యం అని నీ అమ్మా మొగుడు చెప్పాడా
నాడు - 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్
నేడు - 45 ఏళ్లకే పింఛన్ అని నేను ఎక్కడ చెప్పా ?
నాడు - పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచం
నేడు - లీటర్కు రూ.5 పెంచి, బాదుడే బాదుడు
నాడు - అమరావతిని స్వాగతిస్తున్నా, 30 వేల ఎకరాలు కావాలి
నేడు - అమరావతిని 3 ముక్కలు చేసారు
నాడు - టీడీపీ వాళ్లు ఇసుక దోచేస్తున్నారు
నేడు - 10 రెట్లు పెరిగిన ఇసుక ధరలు - ఎవరు ఇసుక దోస్తుంది ?
నాడు - కాళేశ్వరంతో ఏపీ ఎడారి
నేడు - కాళేశ్వరం ప్రారంభానికి వెళ్ళి టెంకాయ కొటారు
నాడు - పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలి
నేడు - రివర్స్ టెండరింగ్ పేరుతో సొంత వారికే కాంట్రాక్టు
నాడు - రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
నేడు - గిట్టుబాటు ధర లేక వేల కోట్లు నష్టం
నాడు - ప్రజలపై భారాలు వెయ్యం
నేడు - పెట్రోల్ రేట్లు, బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచారు
నాడు - ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
నేడు - దాదాపుగా లక్ష మంది ఉద్యోగుల తొలగింపు
నాడు - మా బాబాయ్ వివేకా హత్య పై సిబిఐ ఎంక్వయిరీ కావాలి
నేడు - సిబిఐ ఎంక్వయిరీ అవసరం లేదు
నాడు - శేఖర్ రెడ్డి టిడిపి బినామీ
నేడు - శేఖర్ రెడ్డికి పదవి
నాడు - ఎన్ఆర్సీ కి అనుకూలంగా పార్లమెంట్, రాజ్యసభలో మద్దతు
నేడు - ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో స్టేట్మెంట్
నాడు - సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేస్తా
నేడు - రెండు రెట్లు రేటు పెంచి, చెత్త బ్రాండులు పెట్టి, ఆర్ధికంగా మరింత కుంగదీస్తూ, ఆరోగ్యం కూడా నాశనం అయ్యేలా చేస్తున్నారు
నాడు - కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, మాకు అందరూ సమానమే
నేడు - నామినేటడ్ పదవులు అన్నీ ఒక వర్గానికే