ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.
డబ్బుల కోసం నాయకులను ఎన్నికల్లో గెలిపించే కన్సల్టెంట్.
మోడీ వెలుగులోకి తెచ్చిన ఆణిముత్యం ఈయనే.
ఇపుడు మోడీకి ఈయనకు పెద్ద ఇగో క్లాషెస్.
నేను నిన్ను ప్రధాని చేశాను అన్న భావన పీకేది, నువ్వు ఓ పిపీలికం అది నాా టాలెంట్ అంటాడు మోడీ.
వీళ్లిద్దరి ఇగో వల్ల అతను మోడీ వ్యతిరేక సీఎంలకు పనిచేస్తాడు.
జగన్ డీల్ సెపరేట్.
తాజాగా ఆయన ఒక సంచలన ప్రకటన చేశాడు. మోడీ ఓటమే లక్ష్యంగా పీకే ప్రిపేరయ్యాడని ఈ ప్రకటనతో తెలుస్తుంది.
2024 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి గా రాహుల్ గాంధీ ని ప్రకటిస్తే రాహుల్ కోసం పనిచేయడానికి సిద్ధం అని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్య చేశాడు.
అయినా కాంగ్రెస్ ఇంకో ఛాన్స్ ఏముంది. ఇపుడు కూడా రాహుల్ ని ప్రకటించకపోతే ఇంకెప్పుడు ప్రకటిస్తారు? సరే అవన్నీ పక్కన పెడితే.. పీకే తాజా ప్రకటనతో జనాలకు సీన్ మొత్తం అర్థమైపోయింది.
అపుడు రాహుల్ ను పప్పు అనుకున్నాం గాని… మోడీ రాహుల్ ఇద్దరికీ పెద్దగా తేడా లేదని ఇపుడు అందరికీ అర్థమవుతోంది మెల్లగా. కాబట్టి ప్రశాంత్ కిషోర్ పని పెద్ద కష్టం కాకపోవచ్చు. సులువుగా పీకే తన గోల్ ని రీచవుతాడేమో.