విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఫైరయ్యారు. మాజీ మంత్రి, దివంగత నేత కుమారుడు టార్గెట్‌గా నాని విరుచుకుపడ్డారు. దేవినేని నెహ్రూ కుటుంబంపై ఎంపీ కేశినేని నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యారాజకీయాలు ప్రోత్సహించలేదని తెలిపారు.
వంగవీటి రాధా, రంగా అనుచరులు స్వార్థ ప్రయోజనాల కోసం.. హత్యారాజకీయాలు చేయడంతో రంగా చనిపోయారని చెప్పారు. టీడీపీ ఆఫీస్‌పై, పట్టాభి ఇంటిపై ఎవరైతే దాడి చేశారో.. వారే రాధా ఆఫీసు దగ్గర రెక్కీ నిర్వహించారని కేశినేని నాని తెలిపారు.
అయితే.. ఎక్కడా దేవినేని పేరు వాడకపోయినా.. విజయవాడలో ఒకప్పుడు రాజకీయాలు చేసిన నేత.. తమ్ముణ్ని పోగొట్టుకు న్నా.. మారని నాయకుడు.. నిత్యం పంచాయితీలు చేసిన నాయకుడు.. అంటూ.. నెహ్రూను పరోక్షంగా టార్గెట్ చేశారు.
ఇప్పుడు ఆయన కుమారుడు కూడా చోటా రౌడీలా విరుచుకుపడుతున్నాడని.. గతంలో ఎప్పుడో జరిగిన రౌడీ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాడని.. అన్నారు. గూండాలు.. రౌడీలు.. ఉన్న పార్టీలో అంతకు మించి ఇంకేమీ ఆశించలేమని.. ఎంపీ నాని వ్యాఖ్యానించారు. తాజాగా నాని వెంట మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా ఉండడం గమనార్హం.
రాధాను చంపడానికి రెక్కీ చేసింది దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు వెంకట సత్యనారాయణ అలియాస్ అరవ సత్యమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఆయనకు బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని చెబుతున్నారు. కానీ దీన్ని అరవ సత్యం కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.
సత్యంను పోలీసులు తీసుకువెళ్లలేదన్నా రు. ఆయన అనారోగ్యకారణంగా ఆస్పత్రిలో చేరారని అతని కుమారుడు చరణ్ తెలిపాడు. ఇక, పోలీసులు కూడా తమకు ఎలాంటి ఆదారాలు అందలేదని.. ఎవరూ ఫిర్యాదులు చేయలేదని పేర్కొనడం గమనార్హం.