భారత న్యాయ వ్యవస్థపై తనకు అపార గౌరవం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానిం చారు. “నేను చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించేలా కొందరు చిత్రీకరించారు. కానీ, నా ఉద్దేశం అది కాదు. న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయి. నా వ్యాఖ్యలను వేరేగా చిత్రీకరించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. రాజ్యాంగాన్ని గౌరవించే నేను.. న్యాయవ్యవస్థ పట్ల మరింత విశ్వాసంతోనే ఉంటా“ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
అయితే.. రేవంత్ ఇలా వ్యాఖ్యానించడానికి కారణం.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు ఇటీవ ల బెయిల్ వచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని పత్రికల్లో ప్రచురితం కావడమే. అయితే.. ఆయన ఏమన్నారో.. కానీ, పలు మీడియాల్లో న్యాయవ్యవస్థపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కోణంలో ఉన్నాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఈ విషయంపైనే సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా.. బీఆర్ ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ విషయాన్నికోర్టుకు వివరించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. “ఆ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటలేనా? రాజకీయ పార్టీలను సంప్రదించి మేం నడుస్తామా? “ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి తాజాగా వివరణ ఇవ్వడంతోపాటు.. విచారం కూడా వ్యక్తం చేశారు. ఇక, కవిత బెయిల్పై బయటకు వచ్చిన సందర్బంగా రేవంత్.. “బీఆర్ఎస్, బీజేపీల ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది“ అని పేర్కొన్నారంటూ.. పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఇదే వివాదం అయింది. అయితే.. రేవంత్ వివరణతో ఇది సర్దు మణిగింది.