I thank @INCTelangana team and our dearest congress soldiers for making #Gajwel meeting a huge success. pic.twitter.com/HkxY06mria
— Revanth Reddy (@revanth_anumula) September 17, 2021
టీపీసీసీ రేవంత్ రెడ్డి గజ్వేల్ నడిబొడ్డున సమర శంఖారావం పూరించారు. కేసీఆర్ అంత అద్బుతమైన పాలన ఎన్నడూ లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. మరి అదే నిజమైతే రేవంత్ సభ ఇంత భారీగా ఎందుకు సక్సెస్ అయ్యింది.
కేసీఆర్ దళితబంధు ప్రకటించాక… అది సక్సెస్ అనుకున్నాక… సీఎం కేసీఆర్ ఇలాకాలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహిస్తే ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులు గజ్వేల్ గడ్డపై కదం తొక్కాయి. ఆ స్థాయిలో రేవంత్ సభకు జనం వస్తారని ఎవరూ ఊహించలేదట. ఈ ఉత్సాహంతో రేవంత్ ప్రసంగం మరింత ఘాటుగా మారింది.
తెలంగాణ అంటే దోపిడీదారుల గుండెల్లో ల్యాండ్మైన్లు పేల్చిన గడ్డ అని.. దొరల గడీలను బద్దలు కొట్టిన గడ్డ… అందుకే కేసీఆర్ లో వణుకు మొదలైంది అని రేవంత్ అన్నారు.
తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని గజ్వేల్ ప్రజలు రెండుసార్లు కేసీఆర్ ను గెలిపించారని రేవంత్ అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి అయ్యిందన్నారు.
కావేరి సీడ్స్ భాస్కరరావు భూములు కాపాడేందుకు కేసీఆర్ తెలంగాణ పేదల భూములు లాక్కున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చావా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ , డ్రగ్స్ తీసుకునేవారికి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని ధ్వజమెత్తారు. మద్యం ఆదాయం కోసం కేసీఆర్ తాపత్రయం వల్ల ఈరోజుల్లో 12 ఏళ్లకే పిల్లలు మద్యం తాగే పరిస్థితి దాపురించింది అని రేవంత్ విమర్శించారు.
చినిగిన అంగీలతో తినడానికి తిండిలేక అటుకులు తిని ఉద్యమం చేశానని చెప్పిన కేసీఆర్… ఏం వ్యాపారం చేసి వందల ఎకరాల ఫాం హౌజ్‌లు సంపాదించాడు? అది ఫాం హౌస్ కాదు, కేసీఆర్ డబ్బులు దాచుకునే బ్యాంకు అన్నారు.