ఔను.. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తున్నామని.. చెబుతున్న ఏపీ ఒకవైపు.. అసలుకేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతున్నారని చెబుతున్నా తెలంగాణ ప్రతిపక్షాలు మరోవైపు.. వెరసి .. రెండు రాష్ట్రాల పరిస్థితిపై.. ఇప్పుడు సంచలన నివేదిక ఒకటి వచ్చింది. రెండు కీలక విషయాలపై ఈ నివేదిక.. నిగ్గు తేల్చింది. గత ఏడాది కాలంలో ఇన్నోవేషన్(సృజనాత్మకత), పెర్ఫార్మెన్స్(సామర్థ్యం) రంగాల్లో రెండు రాష్ట్రాల పరిస్థితిని ఈ నివేదిక వెల్లడించింది.
ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 7వ స్థానంలో ఉన్న ఏపీ.. ఈ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. నాలుగో ర్యాంకులో ఉన్న తెలంగాణ 2వ స్థానానికి చేరింది. మొదటి స్థానంలో కర్ణాటక ఉండగా.. పెర్ఫార్మర్ విభా గంలో తెలంగాణకు మొదటి ర్యాంకు లభించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 14వ ర్యాంకు వచ్చినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ పరిణామం.. ఎవరూ ఊహించనిది. ఇప్పటి వరకు కేంద్రం తమపై కత్తినట్టు వ్యవహరిస్తోందని.. చెబుతున్న తెలంగాణకు అయితే.. బిగ్ సర్ప్రైజ్ అయితే.. ఏపీకి మరింత బిగ్ షాక్.
తెలంగాణలో ఏం జరిగింది?
తెలంగాణ ఒక్కసారిగా సామర్థ్యం, సృజనాత్మక రంగాల్లో పుంజుకోవడానికి అక్కడి ప్రభుత్వం చేస్తున్న పనులేనని కేంద్రం వెల్లడించింది. తెలంగాణ పెద్ద మల్టీనేషనల్ సంస్థలు, స్టార్టప్‌లకు నెలవుగా మారిం ది. రాష్ట్రం అన్ని కొలమానాల్లోనూ మంచి పనితీరు కనబరిచింది.ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్స్ (ప్రతి లక్ష జనాభాకు) 9.7 నుంచి 15.7కి పెరిగాయి. నాలెడ్జ్ వర్కర్స్ తయారు చేయడంలో రాష్ట్రానికున్న సత్తాకు ఇది అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనికి ఉత్తమ మార్కులు వేసింది.
తెలంగాణలో యువ పారిశ్రామ వేత్తలకు ప్రోత్సాహం కూడా పెరిగింది. వీరి స్టార్టప్స్ సంఖ్య 4,900 నుంచి 9వేలకు చేరాయి. అదేసమయంలో ఏపీలో మాత్రం పరిస్థితి నానాటికీ దిగజారిపోయింది. దీనికి కారణం.. ఎక్కడా యువతను ప్రోత్సహించే కార్యక్రమాలు లేవు. కేవలం ప్రజలకు డబ్బులు పంచే బటన్‌ను నొక్క డం తప్ప.. సీఎం జగన్ ఏమీ చేయలేక పోతున్నారు(ఇది ఆయన చెప్పిన మాటే). ఈ క్రమంలో ఏపీ అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోతోందనేది మేధావుల మాట. మరి దీనిపై వైసీపీ నాయకులు..కానీ, ప్రభుత్వం కానీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.