ఏపీ ప్రజలకు జగన్ గట్టి షాకే ఇచ్చారు. 8.44 లక్షల రేషన్ కార్డులను జగన్ తొలగించారు. తాను అనుకున్న సంక్షేమ పథకాలకు డబ్బులు చాలలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి ఎవరూ పెట్టుబడులు కొత్తగా పెట్టకపోవడంతో పన్నుల ఆదాయ పెరగలేదు. కొన్ని కంపెనీలు కూడా ప్రభుత్వ తీరుతో పారిపోయాయి. దీంతో ఏపీ ఆదాయ భారీగా పడిపోయింది.
కోల్పోయిన ఆదాయంతో జీతాలు ఇవ్వడమే ఏపీ ప్రభుత్వానికి కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ధరలు పెంచేశారు. మందు, ఇసుక, పెట్రోలు, డీజిలు, గ్యాస్, కరెంటు ఇంకా ఇలాంటివన్నీ పెంచేశారు. అయినా ఆదాయం సరిపోలేదు. దీంతో టోల్ గేట్లు పెట్టాడు. అయినా ఆదాయం సరిపోలేదు. దీంతో పేదలకు ఇచ్చే రేషన్ కార్డుల్లో కోత విధిస్తే డబ్బు పొదుపు చేయొచ్చు అనుకున్నారు. అందులో భాగంగా 8.44 లక్షల రేషన్ కార్డులను తొలగించింది జగన్ సర్కారు.
దీంతో జనం లబోదిబోమంటున్నారు. జగన్ కి ఓటేసి మాకష్టంమేమే తెచ్చుకున్నాం అని బాధపడుతున్నారు. అయితే, జగన్ ఇంతటితో ఆగలేదు. సరుకులు ఇవ్వడానికి కొత్త రూల్ పెట్టారు.
రేషన్ పంపిణీలో ఉన్న నిబంధనల్ని కూడా ప్రభుత్వం మార్చంది. ఇక నుంచి రేషన్ తీసుకోవాలంటే మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. వలంటీర్లు సరుకులు అందజేసిన తర్వాత లబ్ధిదారుడి మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వలంటీర్లు సర్వర్ లో ఎంటర్ చేసిన తర్వాతే సంబంధిత కుటుంబానికి సరుకులు అందినట్లు లెక్క. అంటే పేదలు ఎవరైనా ఫోన్ లేని వృద్ధ దంపతులు ఉంటే వారు ఇపుడు వేల రూపాయలుపెట్టి ఫోన్ కొనాలి. అదీ కథ.