బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ?

తెలంగాణలో బీజేపీని ఉరకలు పెట్టిస్తున్న బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  రెండు  తెలుగు రాష్ట్రాలలో ఒక్కరే కేంద్ర మంత్రి ఉండటంతో , బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వదు అనే ముద్రను తొలగించడంతో పాటు బండి సంజయ్ కు మరింత భద్రత కల్పించే అవకాశం కూడా ఉంటుంది.

ఇప్పటికే వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి ఇచ్చారు. ముస్లిం జనాభా హైదరాబాదు నగరంలో చాలా ఎక్కువ. కిషన్ రెడ్డి హోం శాఖ మంత్రి అయినా ఢిల్లీ కంటే ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. హైదరాబాదులో పెరుగుతున్న ముస్లిం జనాభా నేపథ్యంలో వారి ప్రభావం వల్లో హిందువుల బీజేపీకి దగ్గరవుతారని బీజేపీ వేసిన అంచనా ghmc ఎన్నికల్లో నిజమైంది.

ఇపుడు బండికి కేంద్ర పదవి ఇవ్వడం ద్వారా మీడియా ప్రెజెన్స్ మరింత పెంచడానికి తద్వారా బీజేపీ వాయిస్ మరింత స్ట్రాంగ్ గా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పనికొస్తుంది. అంతేకాకుండా వలసలను ప్రోత్సహించడానికి కూడా ఇది పనికొస్తుందన్ని బీజేపీ తాజా అంచనా. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.