ఇది కల్తీ లోకం. పాల నుంచి పురుగుల మందు వరకు దేన్నయినా అవకాశం దొరికితే చాలు కల్తీ చేశారు. పిల్లలు తాగే పాలలో యూరియా కలిపే పాడులోకం ఇది. అలాంటి ఇక తినేది కాదు అంటే కల్తీ చేయడానికి వెనుకాడరు. ఇక కరోనా తర్వాత మనం అందరూ కొంటున్న వస్తువు శానిటైజర్. ఇది ఎక్కడపడితే అక్కడ రోడ్డు పక్కన అమ్మేస్తున్నారు. అది మంచిదో కాదో తెలియదు. అమ్మేవాడు చెప్పేదే కొనవాడు నమ్ముతున్నాడు. బడ్జెట్ లో రావడం కూడా టెంప్ట్ చేస్తుంది. అందుకే ఈ మోసాలను కనుక్కోవడానికి ఇపుడు ఒక సంస్థ పరిష్కారాన్ని కనిపెట్టింది.
వాస్తవానికి శానిటైజర్లో ఇథైల్ ఆల్కహాల్ పాళ్లు కచ్చితంగా 70 శాతం ఉండాలి. ఇది WHO ప్రమాణాలు. దాంతో పాటు గ్లిజరిన్ కూడా అందులో ఉండాలి. లేకపోతే చేతులు పొడిబారుతాయి. ఈ పొడిబారడం పక్కనపెడితే క్రిములను చంపే ఆల్కహాల్ మాత్రం 70 శాతం ఉండితీరాల్సిందే. మరి మనం కొనే శానిటైజర్ సరైనదో కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రస్తుతానికి మనకున్న ఒకే ఒక అవకాశం బ్రాండెడ్ కొనడమే.
అయితే, చిన్న పరీక్ష ద్వారా ఏ శానిటైజర్ అయినా మంచిదో కాదో చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు. ‘‘ఒక చెంచా గోధుమ పిండి తీసుకొని, దానికి శానిటైజర్ కలపండి. ఒకవేళ కలిపిన తర్వాత పిండి చేతికి అతుక్కుంటే శానిటైజర్ మంచిది కాదని అర్థం. పిండి పొడిగానే ఉంటే, చేతికి అతుక్కోకపోతే అది మంచిదని అర్థం’’
వినియోగదారుల హక్కులను కాపాడటం కోసం పనిచేస్తే ‘‘Consumers guidence society” పలు కంపెనీలు, రోడ్డు పక్కల శానిటైజర్లపై పరిశోధనలు చేయించింది. అందులో గోధుమ పిండితో ఈ విషయాన్ని కనిపెట్టొచ్చని కనుక్కుంది.
శానిటైజర్లపై తమ అధ్యయన నివేదిక వెల్లడించాక, తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ కామత్ చెప్పారు. దీన్ని బట్టి ఈ వ్యాపారంలో ఎంత పెద్ద మాఫియా ఉందో అర్థమవుతోంది.