యాంకర్ కు డ్రగ్ నోటీసులు

Movies Sep 25, 2020

బాలీవుడ్ ను ఊపేస్తున్న డ్రగ్స్ లొల్లికి ఏ మాత్రం తీసిపోని రీతిలో శాండల్ వుడ్ లోనూ పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. బాలీవుడ్ కు కాస్త ముందే శాండల్ వుడ్ లో డ్రగ్స్ కేసులు నమోదు కావటం.. ఇప్పటికే పలువురు నటీనటులను అరెస్టులతో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికి డ్రగ్స్ ప్రకంపనలు తగ్గలేదు.

తాజాగా కన్నడ టీవీ యాంకర్ గా గుర్తింపుతోపాటు.. సెలబ్రిటీగా మంచి పేరున్న అనుశ్రీకి తాజాగా మంగళూరు సీసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆమెను విచారణకు హాజరు కావాలని కోరారు. డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడు చెప్పిన వారిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా యాంకర్ అనుశ్రీకి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. తనకు కిశోర్ శెట్టితో సంబంధం లేదన్నారు. పదేళ్ల క్రితం అతడితో డ్యాన్స్ చేశానే తప్పించి.. అతడితో తనకెలాంటి పరిచయం లేదన్నారు. మంగళూరుకు చెందిన అనుశ్రీ బెంగళూరులో స్థిరపడ్డారు. టీవీ యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటివేళ.. డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించటంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.