• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే…  దేశంలో సీన్ ఎలా ఉంది?

admin by admin
May 2, 2022
in Around The World, India, Politics, Top Stories
0
Indian political parties

Indian political parties

0
SHARES
355
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మహా అయితే మరో రెండేళ్లు. మామూలుగా అయితే ఇంకా చాలా కాలముందిగా? అనుకునే పరిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నాయి రోజులు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలు.. ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతోంది. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్నట్లుగా కొన్నిపార్టీలు ఆలోచిస్తున్నాయి.

ఇలాంటి వేళ.. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే టైం ఉన్న వేళ.. పార్టీలు తమ అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే రెండు దఫాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పెట్రోల్.. డీజిల్ ధరలు దారుణంగా పెరిగినప్పటికీ.. ఆయన గ్రాఫ్ మాత్రం చెక్కు చెదర్లేదు. పెట్రోల్.. డీజిల్ ధరల మీద సగటు జీవిలో కోపం ఉన్నా.. అందుకు కారణంగా మోడీ ప్రభుత్వ విధానాలన్న దానిపైనా ఏకీభవించే వారు సైతం.. మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న దగ్గరకు వచ్చేసరికి మాత్రం.. అందుకు ఒప్పుకోని పరిస్థితి నెలకొంది. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని చెబుతున్నారు.

రాష్ట్రాల్లో కొంత సీన్ మారుతున్నా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీని కాకుండా మరో నేతను అనుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. దీనికి తోడు గడిచిన పదిహేనేళ్లుగా హిందుత్వం అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. తమను అణగదొక్కుతున్న రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలన్న భావనకు వస్తున్నారు.

ఈ పరిణామం ఇంతకాలం సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే వారికి తెగ ఇబ్బందిగా మారింది. మీది సెక్యులరిజం కాదు.. సూడో సెక్యులరిజమంటూ మండిపడుతున్నారు. అలాంటి వారి చేతులకు అధికారాన్ని అప్పజెప్పేందుకు ఏ మాత్రం సిద్దంగా లేమని చెబుతున్నారు.

ఇలాంటి వాతావరణంలో అందరికి ఓకే అనిపించే పాలకుడిగా నరేంద్ర మోడీ కనిపిస్తున్నారు. ఇది ఆయనకు బోలెడంత అడ్వాంటేజ్ గా చెప్పాలి. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా దేశ ప్రధానిగా ఉంటున్న ఆయన పాలనపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికి..మన్మోహన్ సర్కారు వేళ వెలుగు చూసిన కుంభకోణాలేవీ మోడీ సర్కారులో వినిపించకపోవటం.. కనిపించకపోవడం ఒక అడ్వాంటేజ్ గా మారింది.

దీనికి తోడు అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ అంతకంతకూ పెరగటం.. వివిధ దేశాలు భారత్ కు ఇచ్చే ప్రాధాన్యతలో మార్పులు రావటం లాంటి వాటి వెనుక మోడీనే కారణమన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. విశ్వవేదికల మీద గతానికి భిన్నంగా తన సత్తా చాటే విషయంలో వెనక్కి తగ్గట్లేదు.

అగ్రరాజ్యాలు ఏ రీతిలో అయితే తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ.. ఆ వాదాన్ని వినిపించే విషయంలో అస్సలు తగ్గవో.. మోడీ సర్కారు అలాంటి తీరునే ప్రదర్శించటం పలువురిని ఆకర్షిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళలో.. ఇప్పటికైతే మోడీ మాష్టారు తిరుగులేని ఇమేజ్ తో ఉన్నారని చెప్పక తప్పదు.

Tags: BJPCongressIndiaIndian electionsModirahul gandhisonia
Previous Post

పుష్కలమైన ఎద సంపద… క్లీవేజ్ క్వీన్

Next Post

జ‌గ‌న్‌లో ఎప్పుడూ లేని ఈ కంగారు ఎందుకు….!

Related Posts

Top Stories

మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు

June 6, 2023
Trending

ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ

June 6, 2023
Trending

సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట

June 6, 2023
Trending

ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి

June 6, 2023
Trending

సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?

June 6, 2023
Trending

షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్

June 6, 2023
Load More
Next Post

జ‌గ‌న్‌లో ఎప్పుడూ లేని ఈ కంగారు ఎందుకు....!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ
  • సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట
  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra