ఏపీలో టీడీపీ సీనియర్లు, జూనియర్లు అనే తేడాలేకుండా.. నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు. దీంతో ఏపీ టీడీపీని నిర్బంధించినట్టు అయింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలైన వెంకాయమ్మపై వైసీపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ.. ఆ పార్టీ చలో కంతేరుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీ సులు భారీగా సిబ్బందిని మోహరించారు.
తాడికొండ, కంతేరులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు టీడీపీ కార్యాలయం నుం చి చలో కంతేరు కార్యక్రమం చేపట్టగా..టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబును గృహ నిర్బంధం చేశారు. బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు తీరును తప్పుబట్టిన నక్కా ఆనంద్‌బా బు.. ఎలాగైనా కంతేరు వెళ్తామన్నారు.
తాడేపల్లిలో టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనుమతి లేకుం డా బయటికి వెళ్లరాదంటూ శ్రావణ్ కు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయానికి వెళ్తుంటే అడ్డుకోవడానికి మీరు ఎవరని.. తెనాలి శ్రావణ్‌కుమార్ పోలీసులను ప్రశ్నించారు. కార్యాలయానికి పోవడం తన హక్కు అన్నారు.
కంతేరు వెళ్లకుండా కృష్ణా-గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహా నిర్భం ధం చేస్తున్నారు. విజయవాడలో దేవినేని ఉమా, నందిగామ లో తంగిరాల సౌమ్య లను గృహ నిర్బంధం చేసారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు.
కంతేరులో పోలీసుల జల్లెడ
కంతేరులోనూ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గ్రామానికి వచ్చే అన్ని మార్గాలను ప్రత్యేక బలగాలను మోహరించారు. గ్రామాలకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. గ్రామంలోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు వందల మంది పోలీసుల తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తుళ్లూరు డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వెంకాయమ్మ ఇంటి చుట్టూ 30 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.