బాలీవుడ్ లో పలువురు నటీనటులు, హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుంటారన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో డ్రగ్స్ తేనె తుట్టె కదిలింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ సీనియర్ హీరో తాను డ్రగ్స్ తీసుకున్నానని బహిరంగంగా వెల్లడించి షాకిచ్చాడు.
సంజు..అలియాస్ బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ‘కేజీఎఫ్-2’ చిత్రంలో అధీరా పాత్రలో అదరగొట్టిన మున్నాభాయ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సంజూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. కేజీఎఫ్-2 సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిననని, అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తాననే ఉద్దేశ్యంతో డ్రగ్స్ తీసుకోవడం మొదలుబెట్టానని సంజూ చెప్పాడు.
అమ్మాయిలతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ ప్రాసెస్‌లో డ్రగ్స్‌కి బానిసైన తనకు ఆ సంకెళ్లు తెంచుకోవడానిక చాలా కష్టపడాల్సి వచ్చిందని బాధపడ్డారు. అందరికీ దూరంగా ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడినని, తన జీవితంలో ఆ పదేళ్లు రూమ్‌లో లేదా బాత్రూమ్లో గడిపేవాడినని అన్నాడు. షూటింగ్‌లపై ఆసక్తి ఉండేది కాదని, కానీ, డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రీహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి కొంతకాలం అక్కడే గడిపానని అన్నాడు.
అక్కడ నుంచి తిరిగి వచ్చాక అందరూ తనను డ్రగ్గీ అని పిలిచేవారని, ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. అందుకే కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నానని, దీంతో అప్పటి నుంచి అందరూ ‘క్యా బాడీ హై’అంటూ ప్రశంసించారని తన గతంలోని చేదు ఘట్టాల్ని నెమరేసుకున్నాడు సంజూ భాయ్.