హైదరాబాద్ నగర శివారులోని మంచిరేవులలో ఉన్న హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న వారిని గత నెల 31న పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుత్తా సుమన్… పుట్టినరోజు వేడుకల కోసం ఈ ఫామ్‌హౌస్ ను అద్దెకు తీసుకొని పేకాట ఆడిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సుమన్ సహా 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, వీఐపీలు అక్కడ పేకాడుతున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గుత్తా సుమన్ ఇచ్చిన సమాచారంతో శివలింగప్రసాద్ కు కూడా ఈ పేకాట రాకెట్ లో హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో, తాజాగా నేడు శివలింగప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శివలింగ ప్రసాద్ ను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా…కోర్టు ఆయనకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, శివలింగప్రసాద్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిందే.సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో ఇవాళ శివలింగ ప్రసాద్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ కు పలువురు రాజకీయ నేతలతో సంబంధాలున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
అంతేకాదు, గోవా,శ్రీలంకలతో పాటు పలు దేశాల్లో గుత్తా సుమన్ కు క్యాసినోలున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు, పేకాట ఆడేవారి కోసం సుమన్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా పేకాట ఎక్కడ ఆడుతారో సమాచారం చేరవేసేవాడని తెలుస్తోంది. డిజిటల్ రూపంలో డబ్బులను తీసుకొనే సుమన్…వాటికి సరిపడే కాయిన్స్ ఇచ్చి పేకాట ఆడించేవాడని తెలుస్తోంది.