కొన్నేళ్లుగా ఓ కుర్రాడు తెలుగు తెరను శాసించే క్రమాన్ని ఇష్టంగా చేసుకుంటున్నాడు. కొన్ని తప్పులు చేస్తున్నా కూడా వాటి నుంచి నేర్చుకునే ప్రయత్నంలో ఏనాడు వెనుకడుగు ఉండదు. మంచి కుర్రాడు. చిన్నారులకు సాయం చేసి వారి హృదయ సంబంధ రుగ్మతలను దూరం చేసి వారికి ప్రాణం పోసే కథానాయకుడు.
మళ్లీ అడగకండి ఆయన్ను మాటఇస్తే మహేశ్ అంతే ! ఆయన్ను అంతా అభిమానిస్తారు. సాయం చేసిన సందర్భంలో పవన్ అభిమానులు ఆయన్ను నెత్తిన పెట్టుకుంటారు. చిరు సర్ ఆయన్ను ఎంతగా అభిమానిస్తారో ! ఆయన మహేశ్ బాబు. ఇంటి పేరు ఘట్టమనేని.
పూరీ సర్ లాంటి మంచి డైలాగ్ రైటర్లకు ఆయనకు మధ్య మంచి బంధం ఉంది. ఇంకా ఇంకొందరికి. రైటర్ విశ్వ రాశారు ఓ మంచి మాట.. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఇవాళ మహేశ్ బాబు పుట్టిన్రోజు. హ్యాపీ బర్త్ డే సర్.
ఒక్కడు సినిమాలో ఛార్మినార్ గూటికి చేరి చేసిన ప్రేమాయణం ఎంత బాగుంది. ఈ కుర్రాడెవరు అని మరోసారి అడిగి చూసే విధంగా చేశారు. రాజకుమారుడు, టక్కరి దొంగ లాంటి స్టైలిష్ మూవీస్ ఉంటాయి కానీ శ్రీమంతుడు మాత్రం ఆయన స్థాయిని పెంచింది. ఆ మాటకు వస్తే అతడు కూడా ! ఆయన కెరియర్ కు మంచి టర్నింగ్ పాయింట్.
పండుగాడు చాలు రికార్డులు తిరగరాసేందుకు. ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్. కానీ వేడుకలకు దూరంగా ఉంటారు. ప్రచారానికి దూరంగా ఉంటారు. ఒకింత సిగ్గరి. బిడియస్తులు కూడా ఆయన. నాన్న సూపర్ స్టార్ అని ఏనాడూ ఆ విధంగా మేం పెరగలేదు. తప్పండి ఆ విధంగా మేం అనుకోలేదు. అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో ! ఇప్పటికీ ఎప్పటికీ ! ఆయన మంచి స్నేహితుడు, అన్నయ్య అంతకుమించి గుడ్ పేరెంట్. ఇవన్నీ కలిస్తే మహేశ్ బాబు. ప్రిన్స్ మహేశ్ బాబు.
కొసమెరుపుగా ఓ విషయం చెప్పాలి… గవర్నమెంటు సొమ్ముతో జనానికి డబ్బులు ఇస్తూ తన పేరు పెట్టుకుని సొంత డబ్బా కొట్టుకుంటూ ఎవరికి సొంత డబ్బులు ఒక్క రూపాయి విదిలించని వైఎస్ జగన్ సూపర్ స్టారా? సొంత డబ్బులతో వందల మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్ బాబు సూపర్ స్టారా?
ఈ తేడా జనం తెలుసుకోనంత కాలం సినిమా వాళ్ల మీద నిందలు వేసి జగన్ లాంటి వాళ్లు జనాన్ని అడ్డంగా వాడుకుంటూనే ఉంటారు.