హరీష్ సాల్వే… మీడియాను ఫాలో అయ్యేవారిలో ఈయన పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. భారతదేశపు పేరొందిన లాయర్లలో ఒకరు. కుల్ భూషణ్ యాదవ్ కేసును వాదించిన లాయర్ కూడా ఈయనే.
అంతేనా… గతంలో జగన్ కేసుల్లోను కొంతకాలం జగన్ తరఫున లాయర్‌గా వాదించారు. కానీ ఎందుకో ఆ తర్వాత తప్పుకున్నారు. మరి కేసులన్నీ పరిశీలించాక జగన్ విధానాలు తప్పు అనుకున్నారో ఏమో ఆయన జగన్ కు దూరమయ్యారు.
ఇటీవల జగన్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి ఫిర్యాదు చేయడంపై హరీష్ సాల్వే జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఘాటు విమర్శలు చేశారు. హద్దులు మీరిన ఆంధ్రా నాయకులకు గుణపాఠం చెప్పాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ కులం పేరుతో నిందించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఆయన స్పందన ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుతం హరీష్ సాల్వే గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన రెండో పెళ్లి చేసుకుంటున్నారు. హరీష్ సాల్వే భార్య మీనాక్షితో కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు. వారుకూడా సెటిలయ్యారు. తాజాగా 65 ఏళ్ల వయసులో ఆయన లండన్‌కు చెందిన ప్రముఖ కళాకారిణి కరోలిన్ బ్రొస్సార్డ్ను పెళ్లి చేసుకోబోతున్నారు. బుధవారం లండన్‌లోని ఓ చర్చిలో ఈ పెళ్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలం క్రితం ఆయన క్రిస్టియానిటీని ఎంచుకున్నారు.
హరీష్ సాల్వే క్లైంట్లు ఎవరంటే…
ముఖేష్ అంబానీ
టాటా గ్రూపు
వొడాఫోన్
ఐటీసీ హోటల్స్
కొసమెరుపు -ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డేది, హరీష్ సాల్వే సొంత ఊరు ఒకటే. ఇద్దరు మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతానికి చెందిన వారే.