బీజేపీ జాతీయ కార్యవర్గంలో తనకు మొండిచేయి చూపడంతో జీవీఎల్ నరసింహారావు తీవ్ర మనస్తాపంతో వున్నారని సమాచారం. అధికారికంగా వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకూ బీజేపీలో వుంటూ వైసీపీ కోసం పనిచేస్తున్న జీవీఎల్ నరసింహారావు గుట్టుమట్లన్నీ కూపీలాగిన బీజేపీ అధిష్టానం..జీవీఎల్ డబుల్ గేమ్‌కి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఏపీ నుంచి అన్నీ తప్పుడు నివేదికలు పంపిస్తూ అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్న అంశంలోనూ కమలనాథులు జీవీఎల్‌పై తీవ్ర అసహనంతో వున్నారు.
ఇదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఇందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి, జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌లకు ఏపీ నుంచి అవకాశం కల్పించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవీఎల్ నరసింహారావు బీజేపీకి రాజీనామా చేయడంతోపాటు, బీజేపీ ఇచ్చిన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలని డిసైడయ్యారని ఢిల్లీ నుంచి విశ్వసనీయ సమాచారం.
అయితే ఇప్పటివరకూ బీజేపీ ముసుగు వేసుకుని వైసీపీ పనిచేసిన జీవీఎల్.. ఇక బహిరంగంగానే వైకాపాలో చేరి అధికార ప్రతినిధిగా ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టే బాధ్యతలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.