మనోళ్లు సామెతలు ఉత్తినే పెట్టలేదు. వివరంగా చెప్పాల్సిన దానికి సింఫుల్ గా ఒక్క లైన్ లో విషయాన్ని చెప్పేసి వైనం.. ఏపీ ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి చేసే పనుల్ని సిం‘ఫుల్’ గా చెప్పటానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. గురివింద తన కింది నలుపును అస్సలు చూసుకోదన్నట్లుగా తయారైంది సీఎం వ్యవహారం. అదే సమయంలో ఒక వేలు మనం చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తుంటాయన్న సత్యాన్ని పట్టించుకోని బరితెగింపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకే సాధ్యమని చెప్పాలి.
నిత్యం నీతుల గురించి చెప్పే జగన్.. తన వరకు వచ్చేసరికి మాత్రం.. తాను అలాంటి వాటికి అతీతమైన వ్యక్తిని అనుకుంటారేమో అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకుపచ్చ మీడియా అంటూ అరిచి గీపెట్టే జగన్ అండ్ కో.. తాము మాత్రం యధేచ్చగా తప్పులు చేయటం విశేషం. వేలెత్తి చూపించినప్పుడు.. కనీసం తప్పులు చేయకూడదన్న ఆలోచన ఏ మాత్రం లేని జగన్ మీడియా తీరు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.
నిత్యం మీడియా ప్రమాణాలు అంటూ.. నిజం చెప్పటం కోసమే తాను పుట్టినట్లుగా బిల్డప్ ఇచ్చే జగన్ మీడియా సంస్థ తాజాగా చేస్తున్నదేమిటి? అన్నది ప్రశ్న. రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టులో నెంబరు 2 స్థానంలో ఉన్న న్యాయమూర్తి మీదా.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పలువురి మీద ఆరోపణలు చేయటం తెలిసిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు తానిచ్చిన లేఖను ప్రభుత్వ సలహాదారు చేత..మీడియా సమావేశం పెట్టించిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
తన వాదనను వినిపించేందుకు రోజుకో ప్రత్యేక ఇంటర్వ్యూ వేస్తూ.. తనకు కావాల్సిన ప్రశ్నల్ని సంధిస్తూ.. తాను కోరుకున్న సమాధానం వచ్చేందుకు పడుతున్న తిప్పలు జగన్ మీడియాలో అచ్చేసిన అక్షరాల్ని చదువుతుంటే ఇట్టే అర్థమైపోతుంది. పాత్రికేయ ప్రమాణాల గురించి మాట్లాడే జగన్.. తన మీడియా సంస్థలో.. తాను రాసిన లేఖను తప్పు పడుతూ.. విడుదల అవుతున్న వివిధ సంఘాలు (అవేమీ అల్లాటప్పా సంఘాలు కావు) వారు విడుదల చేసిన ప్రకటనల్ని మాట వరసకు కూడా అచ్చేయని వైనం కనిపిస్తుంది.
గురువారం ఒక్కరోజులోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఢిల్లీ బార్ అసోసియేషన్.. సుప్రీం మహిళా సంఘం.. తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్స్ లాంటి సంస్థలు జగన్ చేసిన ఫిర్యాదును తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. అందుకు సంబంధించి ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మరింత మంది జగన్ చర్యను తప్ప పడుతున్నప్పుడు.. తాను చెప్పే మీడియా విలువల్ని పాటించిన పక్షంలో.. పెద్ద పెద్దగా కాకున్నా.. ఒక చిన్న వార్తలో ఈ విషయాల్ని క్యారీ చేయాలి కదా?
మరోవైపు.. తన వాదనకు బలం చేకూరేందుకు వీలుగా తెర మీదకు తెస్తున్న వైనం చూస్తే.. తాను చెప్పాల్సిన విషయాల్ని చెప్పుకుంటూ పోవటమే తప్పించి.. మిగిలినవేమీ తనకు పట్టవన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. వేలెత్తి చూపించే వేళ.. తన వైపు చూపించే అంశాల్ని ప్రస్తావించినప్పుడే మొనగాడితనం అంటే ఏమిటోబయటకు వస్తుంది. బురద వేయటం ఎవరైనా వేస్తారు. అదేమంత పెద్ద విషయం కాదు. తన పాటికి తాను బురద జల్లుతూ.. దాన్ని తప్పు పడుతున్న వారి మాటల్నిమింగేసి.. బయటకు పొక్కకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. జగన్ మాట్లాడే విలువలు విన్నంతనే నవ్వు రాక మానదు. అంతేకాదు.. జగన్ మరీ మీరింత గురివింద? అన్నది అర్థమైపోతుందని చెప్పక తప్పదు.