30 ఏళ్ల గురజాల నియోజకవర్గ రాజకీయంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒకే ఒక్కడుగా పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇప్పటికే ఆరు సార్లు గురజాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన మూడు సార్లు గెలిచి.. మరో మూడోసార్లు ఓడిపోయారు. ఇప్పుడు వరుసగా ఏడో సారి ఇక్కడి నుంచి ఒకే పార్టీ ( టీడీపీ ) తరపున అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలోకి దూకుతున్నారు. ఇన్నేళ్లలో ఇటు యరపతినేని ఓడినా, గెలిచినా, పార్టీనే అంటి పెట్టుకుని గురజాల ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నారు.
అటు మాత్రం ఆయనకు నలుగురు ప్రత్యర్థులు మారారు. 1994లో కాంగ్రెస్ నుంచి కె. రమేష్ చంద్రదత్తు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 1999, 2004లో జంగా కృష్ణమూర్తి యరపతినేనిపై గెలిచారు. 1999 ఎన్నికల్లో యరపతినేని గెలిచినా ఓ అధికారి చేసిన పొరపాటుతో ఆయన స్వల్ప తేడాతో ఓడినట్టు ప్రకటించారు. 2009లో అలా వెంకటేశ్వరరావును ఓడించిన ఆయన, 2014లో తనను రెండుసార్లు ఓడించిన జంగాను ఓడించారు. 2019లో నరసారావుపేట నుంచి వలసొచ్చిన కాసు మహేష్‌రెడ్డి వైసీపీ వేవ్‌లో విజయం సాధించారు.
ఈ సారి గురజాలలో సీనేంటో కాసుకు ముందే అర్థమైంది. పోటీ చేయాలా ? వద్దా ? అన్నది తేల్చుకోలేకపోయారు. ఒకానొక టైంలో నరసారావుపేటకు వెళ్లాలనుకున్నారు. ఇటు నియోజకవర్గంలో పట్టున్న బలమైన బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సైతం దూరం చేసుకున్నారు. కాసుకు ఇప్పుడు అన్నీ దారులు మూసుకుపోయాయి. నియోజకవర్గంలో ఎవ్వరూ సహకరించే పరిస్థితి లేదు. అయినా ఇష్టమో, కష్టమో అన్నట్టు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇక ఇటు యరపతినేనికి ఏడోసారి లైన్ క్లీయర్ అయ్యింది. ఇటీవల ఆయన చంద్రబాబును కలిసినప్పుడు ఈ పారి గతంలో కంటే మరింత మంచి మెజార్టీతో గురజాలలో గెలిచి రావాలని.. నరసారావుపేట పార్లమెంటు విజయంలో గురజాల మెజార్టీ కీలక పాత్ర పోషించాలని కోరారు. ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌ను ఎన్నోసార్లు ధీటుగా ఎదుర్కొనేవారు యరపతినేని. 2009లో ఆయన హవాను తట్టుకుని మరీ గురాజలలో టీడీపీ జెండా ఎగరేశారు. ఇక వైఎస్‌తోనే కాదు కొడుకు జగన్‌తో కూడా పార్టీ కోసం ఢీ అంటే ఢీ అనేలా అసెంబ్లీలోనూ, బయటా వ్యవహరించేవారు.
యరపతినేని మాటలు బలమైన తూటాలు.. ఆయన మాస్ ఇమేజ్, ఆ ఛరిష్మా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ కేడర్‌కే బలం. పార్టీలో తనపనేదో తాను చూసుకునే ఆయన నైజమే అటు చంద్రబాబు, ఇటు యువనేత లోకేష్‌కు దగ్గరిని చేసింది. ఈ సారి గెలిస్తే యరపతినేనికి ఓ కీలకమైన పదవి ఖాయమన్న అంచనాలు పార్టీ వర్గాల్లో బలంగా ఉన్నాయి.