గుంటూరులో టీడీపీ కంచుకోటలను బలంగా ఢీ కొట్టి.. కీలక నేతలను పక్కన కూర్చొపెట్టి.. విజయం సా ధించిన వైసీపీ నేతలు.. ఈ విజయాన్ని ఆస్వాదించలేక పోతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నా యి. దీనికి కారణం.. వారిలో వారే తగువులు పెట్టుకుని.. వారిలో వారే.. తన్నుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రతిపక్షాల కన్నా ఎక్కువగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రతిపక్షాలకు పని తగ్గిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నేతగా గురజాల నుంచి కాసు మహేష్‌రెడ్డి విజయం సాధించారు.
పల్నాడు బెల్టును చూసుకుంటే… మాచర్లలో రెడ్డి వర్గం దూకుడుగా ఉంది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్నారె డ్డి వరుస విజయాలు సాధిస్తున్నారు. సో.. ఈ నియోజకవర్గంలోనూ రెడ్డి వర్గం హవా చలాయిస్తోంది. గురజాల, మాచర్ల తప్ప.. మిగిలిన నియోజకవర్గాల్లో కమ్మ డామినేషన్ ఉంది. అయితే.. వీరిమద్య పెద్దగా వివాదాలు లేవు. అయితే.. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం రాజకీయంగా వివాదాలు తెరమీదికి వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. అయోధ్య రామిరెడ్డికి.. రాంకీ అనే సంస్థలు ఉన్న విషయం తెలిసిందే.
పల్నాడు ప్రాంతంలో రోడ్లు వేసే కాంట్రాక్టును అయోధ్య రామిరెడ్డి.. తీసుకున్నారు. దీనివెనుక.. చాలానే నడిచింది. నేరుగా జగనే ఆయనకు ఈ కాంట్రాక్టు ఇచ్చారని సమాచారం. ఇదిలావుంటే.. తనకు చెందిన సంస్థకు ఇప్పించుకోవాలని భావించారు. అయితే.. నేరుగా జగనే రంగంలోకి దింపడంతో.. ఆళ్ల ఇక్కడ పనులు ప్రారంభించారు. పల్నాడులోని కీలక రోడ్లను రాంకీ సంస్థే నిర్మిస్తోంది. దీంతో తన ఆధిపత్యానికి, ఆదాయానికి కూడా గండి పడుతోందని భావించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి.. అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
అయితే, ఆయన నేరుగా ఎవరినీ విమర్శించకుండా.. రోడ్డు పేరు చెప్పి.. విమర్శలు కుమ్మేశారు. పిడుగురా ళ్ల రోడ్డు గుంతలుగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని.. మరమ్మతులు చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు 2 వారాలు గడువిచ్చినా స్పందించలేదని కాసు విమర్శల వర్షం కురిపించారు. ఇప్పటికి మూడు వారాలు గడిచిందని.. ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ నెల 29న నేరుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా రెడీ అయినట్టు తెలిపారు. మొత్తంగా ఈ వివాదాలు విమర్శలు.. చూస్తే.. ఆర్థిక, ఆధిపత్య పోరు ప్రత్యక్షంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
కీలకమైన జిల్లాలో అత్యంత కీలకమైన నేతలే ఇలా రోడ్డున పడుతుంటే.. సీఎం జగన్‌కు తెలిసే మౌనం పాటిస్తున్నారో.. లేక తెలియలేదో అర్ధం కావడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న ఇక్కడ .. వైసీపీ పునాదులు బలపడాలంటే.. చాలా సమయం పడుతుందని. కానీ, నేతలకు ఆమాత్రం సహనం కూడా కనిపించడం లేదని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా.. నేతల అంతర్గత విభేదాలను తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.