ఊరకరారు.. మహానుభావులు-అన్నట్టుగా రాజకీయాల్లోనూ నాయకులు ఎవరూ కూడా ఊరికేనే దూకుడు ప్ర దర్శించరు. ఏ నాయకుడు దూకుడు వెనుకా.. కారణం లేకుండా ఉండదు. ఇది రాజకీయ చరిత్ర చెబుతు న్న సత్యం! నేటి తరం రాజకీయాల్లో సుందరయ్యను మరిపించే సుందరయ్యలు కనిపించినా.. ఆయన లోని లక్షణాలను మాత్రం వెతికి పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
సో.. పార్టీలు ఏవైనా.. నేతలు ఎలాంటి వారైనా.. సొంతలాభమే పరమావధిగా ముందుకు సాగుతారు. సరే! ఈ సోదంతా ఎందుకు విష యంలోకి వెళిపోతే.. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో రాజకీయాలు భారీ ఎత్తున చర్చ నీయాం శంగా మారా యి.
పరుచూరు నియోజకవర్గంలో టీడీపీ వరుస విజయాలు సాధిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో ఏలూరి సాంబ శివ రావు.. ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే..తొలిసారి ఆయన దూకుడు ఎలా ఉన్నప్పటికీ.. మలిసారి.. అంటే.. గత ఏడాది ఎన్నికల్లో విజయం తర్వాత మాత్రం ఏలూరి దూకుడు పెంచారు.
తన హవాతోనే పార్టీ గెలిచిందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారనేది ప్రధాన విమర్శ. ఇక, జిల్లాలో చాలా మంది నాయకులు ఓడిపోయారు. ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల ఓడిపోయారు. ఈ పరిణా మం.. ఏలూరికి సానుకూలంగా మారింది.
జిల్లాపై దృష్టిసారించేందుకు.. నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదిగేందుకు ఆయన దూకు డుగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు.. జిల్లాస్థాయి సమస్య లపైనా పోరాటం చేస్తానని చెబుతున్నారు.
ఇక, ఇటీవల చంద్రబాబు కూడా ఏలూరిని ప్రోత్సహిస్తున్న ట్టుగా.. బాపట్ల పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇది మరింత ఊపు తెచ్చింది. ఇప్పటికే ఉన్న నేతలను పక్కన పెట్టి.. తనకు ఇవ్వడం వెనుక తన పనితనం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి ఈ దూకుడు వెనుక.. జిల్లా పగ్గాలు చేపట్టే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా? లేదా? చూడాలంటే.. వెయిట్ చేయాల్సిందే.