ఇప్పుడు ఈ మాటే బీజేపీలో వినిపిస్తోంది. 27 ఏళ్లుగా గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తన జోరును కొనసాగిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు కూడా దాటుకుని బీజేపీ మరోసారి ఆధిక్యం కనబరుస్తోంది. స్పష్టమైన ఆధిపత్యంతో దూసుకెళుతోంది.
ప్రదాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేసింది బీజేపీ. గుజరాత్ ముఖ్యమంత్రి భూ పేంద్ర పటేల్ 81 శాతం ఓట్లతో విజయం దక్కించుకుని రికార్డు సృష్టించారు. పటీదార్ సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత హార్దిక్ పటేల్ కూడా దూసుకుపోయారు. దీంతో ఏడోసారి గెలిచి అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది.
గుజరాత్లో బీజేపీ వరుసగా ఏడోసారి జయభేరి మోగించింది. గుజరాత్లో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్ 92 సీట్లు కాగా తాజాగా బీజేపీకి 150 సీట్లలో విజయం దక్కింది. కాంగ్రెస్ కేవలం 20 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా.. ఆప్ 9 సీట్లు తెచ్చుకుంది.
ఇక, దేశంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు విజయం దక్కించుకున్న పార్టీగా, వరుసగా అధికారంలో ఉన్న పార్టీగా పశ్చిమ బెంగాల్‌లోని వామపక్షాలు పేరు తెచ్చుకున్నారు .అయితే, 27ఏళ్లుగా గుజరాత్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. వరుసగా ఏడోసారి పట్టు నిలబెట్టుకున్న నేపథ్యంలో బంగాల్లో వామపక్ష కూటమి పేరిట ఉన్న రికార్డ్‌ను చెరిపేసినట్టు అయింది. బంగాల్లో వామపక్ష కూటమి వరుసగా ఏడుసార్లు గెలిచి.. 2011వరకు అధికారంలో కొనసాగింది.