ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా బాదేయటంలో మోడీ సర్కారు తర్వాతే ఎవరైనా. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టుకోకుండా జీఎస్టీతో వడ్డించేస్తూ.. ఉతికి ఆరేసే ఆయన తనదైన మార్కును మరోసారి ప్రదర్శించారు. తాజాగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇంతకాలం టికెట్ల కొనుగోలు మీద జీఎస్టీ వసూలు చేసే దానికి అదనంగా.. టికెట్ల క్యాన్సిలేషన్ మీదా జీఎస్టీ వడ్డించాలని డిసైడ్ చేశారు.
దీనికి సంబంధించిన ఆదేశాల్ని జారీ చేసింది. ఇదంతా చూస్తే.. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా దేశ ప్రజల జేబుల్ని కొల్లగొట్టే ఐడియాలను ఆయన వేస్తుంటారు. తాజాగా రైల్వే టికెట్ల క్యాన్సిలేషన్ మీదా జీఎస్టీ విధించడం ద్వారా.. తానే చిన్న విషయాన్ని విడిచిపెట్టనన్న విషయాన్ని మరోసారి ఆయన ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పాలి. బుక్ చేసుకున్న రైల్వే టికెట్లను క్యాన్సిల్ చేసుకున్న పక్షంలో జీఎస్టీ చెల్లించాలని నిర్ణయించారు.
కొంతలో కొంత వెసులుబాటు ఏమంటే.. క్యాన్సిల్ టికెట్ల మీద విధించే జీఎస్టీ కేవలం ఏసీ ప్రయాణాల్ని చేసే వారి మీదనే అని చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏసీ కోచ్ లలో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లేదంటే ఏసీ కోచ్ టికెట్ల ను క్యాన్సిల్ చేసుకుంటే.. ఆ టికెట్ల మీద 5 శాతం జీఎస్టీని విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్రైన్ టికెట్ రద్దు చేసుకోవటం అనేది ఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని.. అందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ లలో ప్రయాణం చేస్తుంటే.. ఆ టికెట్ల మీద 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. అదే సమయంలో టికెట్ కాన్సిల్ చేసుకుంటే మరో 5 శాతం వసూలు చేస్తారు. మొత్తంగా టికెట్ కొన్నప్పుడు ఒకసారి.. రద్దు చేస్తే మరోసారి పన్ను పోటు తప్పదన్న మాట.
ఇదంతా బాగానే ఉంది కానీ.. చెప్పిన టైంకు రాకున్నా.. గమ్యస్థానానికి చేరాల్సిన సమయానికి చేరని రైలుకు ఫైన్ వేయటం.. దాని ఆలస్యం కారణంగా కోల్పోయే పని గంటలకు కూడా పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా? ఎప్పుడూ బాదుడేనా? ఇలాంటి బాధ్యతలు కూడా తీసుకోవచ్చు కదా మోడీజీ?
Comments 1