జగన్ పార్టీ నేతలు గాని, జగన్ ప్రభుత్వం గాని ఏదైనా తప్పు చేస్తే … అది బయటపడితే వాళ్లు ఏం చేస్తారో తెలుసా? ఎదురుదాడి. అవును కేవలం ఎదురుదాడి చేస్తారు గాని చేసిన తప్పునకు విచారం కూడా వ్యక్తంచేయరు. ఈ ఎదురుదాడి ఎందుకంటే… ఇష్యూని డైవర్ట్ చేయడానికి. సాధారణంగా ఆ పనిని రెండో స్థాయి మూడో స్థాయి నేతలకు అప్పగిస్తారు. కానీ ఈరోజు ఏకంగా వైకాపా అధినేత జగనే ఆ పనిచేశారు.
ఎందుకంటే ఈరోజు జగన్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఒక ముస్లిం కుటుంబం సామూహిక ఆత్మహత్య విషయంలో కాబట్టి, ముస్లింలు తన ఓటు బ్యాంకు అని జగన్ బలంగా నమ్ముతాడు కాబట్టి తానే రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్ కి ముస్లిం గెటప్ వేసుకొచ్చారు. ముస్లిం కుటుంబం గురించి మాట్లాడటానికి ముస్లిం గెటప్ వేసుకువచ్చిన జగన్ రెడ్డి రేపు బిచ్చగాళ్ల సమస్యల గురించి మాట్లాడాల్సి వస్తే ఆ వేషం వేసుకొస్తాడా? ఏమో మరి వైసీపీ వాళ్లే చెప్పాలి.
ఇది పక్కన పెడితే… అసలే లైవ్ మాట్లాడటానికి జంకే ముఖ్యమంత్రి గారు ఈరోజు గట్టిగా ఆన్ లైన్ లైవ్ లో ఈ విషయంపై మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ నంద్యాల ముస్లిం ఫ్యామిలీ సామూహిక ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యల గురించి మాట్లాడకుండా … అందులో నిందితులు అయిన వారి ఉద్యోగాలు పీకేయడం గురించి మాట్లాడకుండా వారికి టీడీపీ సానుభూతి పరుడైన లాయరే బెయిలు ఇప్పించారని విమర్శించాడు.
ఇక్కడే సీఎం జగన్ అడ్డంగా దొరికిపోయారు.
ఎందుకంటే… ఏడాది పాటు తప్పుడు వేధింపులకు గురిచేసి చిన్నపెద్ద కలిపి 4 గురు సభ్యులున్న కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటే అసలు బెయిలు వచ్చే కేసు ఎందుకు పెట్టారు? 4 ప్రాణాలు తీసిన వ్యక్తులపై అంత సాధారణమైన కేసు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? వారి వెనుక ఎవరున్నారు? జేసీ ప్రభాకర్ రెడ్డిని మళ్లీ మళ్లీ లోపలేయడానికి పనికొచ్చిన చట్టం, ఒక సాధారణ పోలీసును లోపలేయడానికి ఎందుకు పనికిరాలేదు? మరి ఎవరూ కాపాడకపోతే వారు ఎలా మనగలుగుతున్నారు?
ఈ ప్రశ్నలు దేనికీ వైసీపీ వద్దగాని, సీఎం జగన్ వద్ద గాని సమాధానం లేదు. ఇదంతా పక్కన పెడితే…. కుటుంబం ఆత్మహత్య చేసుకున్న నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంతవరకు సారీ చెప్పలేదు. పోలీసులపై ఒత్తిడి తెచ్చిన వారు ఇంతవరకు అరెస్టు కాలేదు. ‘‘ఒకరిని ఉత్తినే వేధించడానికి పోలీసుకి ఏం అవసరం ఉంటుంది. ఎవరో వెనుక ఉండే ఉంటారు‘‘ అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.