తన సున్నపురాయి మైనింగ్ యూనిట్‌ను జగన్ ప్రభుత్వం కక్ష కట్టి మూసివేసినట్లు టిడిపి మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఆరోపించారు. మాకున్న ఆర్థిక ఆధారం మేము అధికారికంగా లీజుకు తీసుకుని నడుపుతున్న ఆ మైన్సే. తాడిపత్రిలోని మైన్స్ & జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దివాకర్, వైయస్ఆర్సిపి ప్రభుత్వం తన కుటుంబంపై ప్రతీకార రాజకీయానికి పాల్పడుతోందని అన్నారు. తన మైనింగ్ యూనిట్ తెరవకపోతే సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ముందు భార్యతో కలిసి నిరసన నిర్వహిస్తామని హెచ్చరించారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిపై దారుణంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో నియంత పాలన సాగుతోంది, త్వరలో ప్రజాస్వామ్య పాలన రాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం ఏదీ చట్టబద్ధంగా చేయడం లేదు. ప్రజలకు అందరికీ అర్థమవుతోంది. త్వరలో తగిన శిక్ష జగన్ అనుభవించబోతున్నారన్నారు.
కక్ష సాధింపు ఎంతో కాలం సాగదన్నారు. అన్నీ లీగల్ గా ఉండటంతో పనికిరాని కేసులు పెట్టి లోపలపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.