ప్రపంచ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటున్న తరుణంలో సీఎం జగన్ పగ్గాలు చేపట్టి…మూడు రాజధానులంటూ అనాలోచిత ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, విశాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తామని వైసీపీ నేతలు గప్పాలు కొట్టారు. అయితే, విశాఖను డెవలప్ చేస్తామని చెప్పిన ఈ వైసీపీ నేతలు…నగరాన్ని అభివృద్ధి చేేయకుండా అంధకారంలోకి నెడుతున్నారు. కొత్తగా భవంతులు నిర్మించి సంపదను సృష్టించాల్సింది పోయి…ఉన్నవాటిని తాకట్టు పెట్టుకుంటూ విశాఖ బ్రాండ్ నేమ్ ను చెడగొడుతున్నారు.
ఇప్పటివరకు విశాఖలో బెదిరింపులు, వసూళ్లు, భూదందాలు, కీలక స్థలాలను స్వాధీనం చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీ నేతల భవనాల ప్రహరీ గోడలు, భవనాలు కూల్చడం…వంటి వాటికి పరిమితమైన వైసీపీ నేతలు తాజాగా ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి కనికట్టు చేసే పనిలో బిజీగా ఉన్నారు. రూ.1,600 కోట్ల అప్పు కోసం గతంలో ఏ ప్రభుత్వం పాల్పడని రీతిలో కక్కుర్తిపనులకు పాల్పడుతున్నారు.‘మిషన్ బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రముఖ పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ స్థలాలను అమ్మి సొమ్ము చేసుకోవాలని స్కెచ్ వేశారు.
ఇందుకోసం పరిపానలనా రాజధాని విశాఖను వైసీపీ నేతలు ఎంచుకున్నారు. విశాఖలో భూముల విలువ ఎక్కువగా ఉండడంతో భారీ మొత్తంలో ఖజానాకు ఆదాయం వస్తుందని భావించారు. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే ప్రయత్నం చేయడంతో కొందరు కోర్టులకెక్కారు. దీంతో, కొత్త పద్ధతిలో ఆలోచించిన వైసీపీ సర్కార్… తనఖా తమాషాకు తెరతీసింది. ఏపీఎస్డీసీకి ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టి, వాటిని తనఖా పెట్టి రుణం తెచ్చుకునే కొత్త ప్లాన్ అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రకారం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో, ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది.
జగన్ సర్కార్ తాకట్టు పెడుతోన్న ప్రభుత్వ భూములివే
1) కలెక్టర్ కార్యాలయం – 2.94 ఎకరాలు
2) ప్రభుత్వ అతిథి గృహం, వాల్తేరు- 5.53 ఎకరాలు
3) జిల్లా శిక్షణా కేంద్రం, చినగదిలి – 0.75 ఎకరాలు
4) మహారాణిపేట తహసీల్దారు కార్యాలయం – 2.35 ఎకరాలు
5) ఫారెస్ట్ గెస్ట్‌హౌస్, వాల్తేరు- 2.08 ఎకరాలు
6) పాత డీఈవో ఆఫీస్- 5.41 ఎకరాలు
7) రైతుబజారు, గోపాలపట్నం – 2.16 ఎకరాలు
8) ప్రభుత్వ ఐటీఐ కాలేజీ- 17.33 ఎకరాలు
9) పాలిటెక్నిక్ కాలేజీ, కప్పరాడ – 23.58 ఎకరాలు
10) రెవెన్యూ క్వార్టర్లు, రేసపువానిపాలెం- 3.00 ఎకరాలు
11) డెయిరీ ఫారం, చినగదిలి- 30.00 ఎకరాలు
12) సీతమ్మధార తహసీల్దార్ ఆఫీసు- 1.00 ఎకరా
13) ఎకార్డ్ యూనివర్సిటీ, ఎండాడ – 101.43 ఎకరాలు
14) సెరీకల్చర్, బక్కన్నపాలెం- 4.00 ఎకరాలు
15) వికలాంగుల శిక్షణ కేంద్రం, బక్కన్నపాలెం- 10.00 ఎకరాలు