అదేంటో… పాపం అందరు సీఎంలపై జగన్ పై పగ బట్టారు.
జయలలిత ఫొటోలు తీయకుండా… అమ్మ క్యాంటీన్లు నడుపుతూ, అమ్మ సైకిళ్లు పంచుతూ, ఎమ్మెల్యేలకు భోజన వసతులు తీసేస్తూ జగన్ ను ఇప్పటికే తమిళ సీఎం స్టాలిన్ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
తాజాగా కేంద్రం నిర్ణయంతో పెట్రోలు డీజిలు ధరలు తగ్గడంతో హమ్మయ్య నాకూ కొంచెం ఉపశమనం వచ్చిందని జగన్ అనుకునేలోపు గోవా ముఖ్యమంత్రి జగన్ పై బాంబేశాడు.
కేంద్రం డీజిల్ ధర 10 రూపాయలు తగ్గించింది
పెట్రోల్ ధర 5 రూపాయలు తగ్గించింది.
దీనికి గోవా సీఎం అదనంగా మరో 7 రూపాయలు తగ్గిస్తూ ప్రజలకు అతిపెద్ద దీపావళి శుభవార్త చెప్పాడు.
ఇపుడు ఏపీలో జగన్ పై జనం నుంచి ఈ ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది.
గోవా సీఎంలా నువ్వు కూడా రాష్ట్రం తరఫున కూడా ధరలు తగ్గించమని సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
దీనికి మరో కారణం కూడా ఉంది.
ఎందుకంటే దేశ వ్యాప్తంగా పెట్రోలు ధరలపై అదనంగా 4 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడు జగన్. మంచి రోడ్లేస్తానని చెప్పి లీటరు మీద మరో అర్ధ రూపాయి లాగుతున్నాడు. ఏడాది నుంచి ఈ పన్ను వేస్తూ ఒక్క రోడ్డు కూడా వేయలేదు.
అంటే గోవా లో పెట్రోలు రేటుతో ఏపీ పోటీ పడాలంటే జగన్ ఇపుడు కేంద్రం తగ్గించిన 5 రూపాయలకు తోడు గోవా సీఎం తగ్గించిన 7 రూపాయలు తగ్గిస్తూ తాను అదనంగా బాదుతున్న 4.5 రూపాయలు కూడా తగ్గిస్తూ అపుడు మాత్రమే గోవా ధరతో ఏపీ ధర సమానం అవుతుంది.
మిగతా రాష్ట్రాలు స్థానిక పన్నులు మాత్రమే వేస్తున్నాయి. ఈ అదనపు 4.5 రూపాయలు జగన్ మాత్రమే వేస్తున్నాడు.
అందుకే గోవా సీఎం 7 రూపాయలు రాష్ట్రం తరఫున తగ్గిస్తే జగన్ 11.5 రూపాయలు తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
కానీ జగన్ తగ్గిస్తాడా?
బాదుడు తప్పు డిస్కౌంట్లు అలవాటు లేని జగన్ పెట్రోలు ధరలు తగ్గిస్తాడని భ్రమ ఎందుకు అని కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
In addition, Government of Goa shall reduce an additional Rs 7 on Petrol and Rs 7 on Diesel, thereby reducing the price of diesel by Rs 17 per litre and petrol by Rs 12 per litre. 2/2
— Dr. Pramod Sawant (Modi Ka Parivar) (@DrPramodPSawant) November 3, 2021