ఈ సోషల్ మీడియా జమానాలో లవ్ స్టోరీలకేం కొదవలేదు. ఫేస్ బుక్ లో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు..పరిచయం అయిన పది రోజులకే ల్ ప్రపోజల్స్….ఆ తర్వాత నెల తిరక్కుండానే బ్రేకప్ లు….అదేంటనడిగితే బ్రేకప్, ప్యాచప్…ఇదంతా నయా ట్రెండ్ అని చెబుతుంటారు. ఇక, ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు, డబుల్ క్రాసింగ్ లవ్ స్టోరీలకు కలియుగంలో కొదవే లేదు. అయితే, సాధారణంగా ఒక అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు పోటీపడడం…అవసరైతే కుస్తీ పోటీలకు దిగడం మామూలే.
అప్పటిదాకా ముస్తఫా..ముస్తఫా అంటూ దోస్తీ పాట పాడుకున్న అబ్బాయిలు కూడా ఆ అమ్మాయి ప్రేమ కోసం కొట్లాటలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, తాజాగా ఝార్ఘండ్ లో ఓ అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు జుట్లు పట్టుకొని మరీ కొట్టేసుకున్న ఘటన వైరల్ అయింది. వాడు నావాడంటే…నావాడంటూ..తమ ప్రియ సఖుడి కోసం ఆ ఇద్దరు భగ్న ప్రేమికురాళ్లు నడి రోడ్డు మీదే బాహుబలి రేంజ్ లో బాహాబాహికి దిగారు. ఇక, నడిరోడ్డుపై ఈ ఇద్దరి సిగపట్లు చూసిన స్థానికులు వారిని విడదీసే ప్రయత్నం చేసినా…వర్కవుట్ కాలేదు.
చివరకు అతి కష్టం మీద వారిని విడదీసి…ఈ కొప్పుల పంచాయతీ తీర్చారు అక్కడి స్థానికులు. అయితే, ఈ వ్యవహారం ఆనోట ఈనోటపడి పోలీసులకు చేరడంతో వారు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, పోలీసులు వస్తున్న సంగతి గమనించిన ఆ అమ్మాయిలో నైస్ గా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఝార్ఖండ్‌లోని సరాయకేలా ఛాండిల్ బజార్లో జరిగిన ఈ ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, ఆ అమ్మాయిలను వెతికే పనిలో స్థానిక పోలీసులు పడ్డారు. యువతులు అదే ప్రాంతానికి చెందిన వారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.