హైదరాబాద్లో గురువారం జరిగిన అలయ్ భలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు రేపిన చిన్న వివాదం పెద్ద చర్చకే దారి తీసింది. ఆయన అవధానం చేస్తున్న సమయంలో చిరంజీవి చుట్టూ పెద్ద ఎత్తున జనాలు మూగడం, ఆయనతో ఫొటోలకు ఎగబడ్డం.. దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ఫొటో షూట్ ఆకపోతే తాను వెళ్లిపోతానని గరికపాటి హెచ్చరించడం.. దీనికి సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.
మనిషికి ఓర్పు, సహనం ఉండాలని ప్రవచనాలు చెప్పే గరికపాటి.. చిరంజీవి ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదానికి ఆ స్థాయిలో అసహనానికి గురవ్వాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడ చిరును నిందించకుండా.. ఫొటోలు ఆపాలంటే అభిమానులకు సున్నితంగా చెప్పాల్సిందని, అలా కాకుండా చిరును టార్గెట్ చేయడం ఏంటనే వాదనలు వినిపించాయి.
అందులోనూ చిరు తర్వాత ఎంతమాత్రం కోపగించుకోకుండా గరికపాటిని గౌ
ఐతే చిరు చక్కటి స్పందనతో ఈ వివాదానికి ముగింపు పలికినా.. ఆయన తమ్ముడు నాగబాబు, మెగా అభిమానులు కలిసి వివాదాన్ని సాగదీస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు స్పందన చాలామందికి రుచించలేదు.
‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడడం పరిపాటే’’ అంటూ పరోక్షంగా గరికపాటికి కౌంటర్ వేశాడు నాగబాబు. ఈ వివాదంలో గరికపాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిరును అందరూ కొనియాడారు. అలాంటపుడు మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆ పెద్దమనిషిని కించపరచడం, ఆయన అభిమానులను బాధించడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక మెగా అభిమానులైతే ఒక రేంజిలో గరికపాటి మీద విరుచుకుపడిపోయారు. ఆయనకు సంబంధించి అనేక వీడియోలు తీసుకొచ్చి ట్రోల్ చేశారు. ఇది బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు, గరికపాటి అభిమానులకు రుచించలేదు. వాళ్లు చిరు మీద, మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
Issue : Garikapati and chiru
Reaction : Nag babu tweeted about it yesterday nyt and today early mrng entire mafia started tweeting. This time sunkara made it Kapu vs Brahmin.
Anntilo sunkara common thing entante caste teskuni rakunda discussion modalettadu. pic.twitter.com/CyfZWOZstT
— Cena ???????? (@taNTRum_guy) October 7, 2022