కొన్ని సంవత్సరాల క్రితం, ఎన్నికల పోలింగ్ అధికారి రీనా ద్వివేది ఎల్లో చీరలో మెరిసి… రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యారు. రీనా 2019 సంవత్సరంలో పసుపు రంగు చీర, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చేతిలో ఈవీఎం పట్టుకుని పోలింగ్ బూత్‌కు వచ్చారు. ఎవరో ఆ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆమె తెగ ఫేమస్ అయిపోయింది.
తాజాగా 2022లో మరోసారి ఆమె వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఎందుకంటే ఆమెది ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్లీ ఆమె ఎన్నికల డ్యూటీకి వచ్చింది. ఈసారి మరింత మోడ్రన్ గా ఆకట్టుకుంటోంది.
రీనా ద్వివేది ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022లో పోలింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఫిబ్రవరి 22 (మంగళవారం) ఆమె మోహన్‌లాల్‌గంజ్ పోలింగ్ బూత్‌కు స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్ ధరించి, లేత గోధుమరంగు హై వెయిస్ట్ ప్యాంట్‌తో టక్కున మెరిసింది.
2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ద్వివేది ఇంటర్నెట్ కి ఎక్కారు. అప్పటి నుంచి ఆమె ఎంతో మందికి ఫేవరెట్ అయ్యారు. శాడ్ పార్ట్ ఏంటంటే.. భర్త చనిపోవడంతో ఆమెకు జాబ్ వచ్చింది. 2013 నుంచి పీడబ్ల్యూడీలో పనిచేస్తున్నారు.
ద్వివేది 2014, 2017 మరియు 2019 ఎన్నికల్లో పోల్ ఆఫీసర్‌గా ఉన్నారు. రీనా ద్వివేది యూపీలోని డియోరియాకు చెందినవారు.
సర్ ప్రైజ్ ఏంటంటే… రీనా ద్వివేది తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో దాదాపు 277K ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అక్కడ ఆమె తన రోజువారీ జీవితంలోని ఫోటోలను పోస్ట్ చేస్తుంది.