వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఉత్సాహం కొరవడిందా? గతంలో ఉన్న ప్రాధాన్యం..ఇప్పుడు వారికి లేకుండా పోయిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో వైసీపీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలన్నా.. వైసీపీ తరఫున అసెంబ్లీలో గళం వినిపించాలన్నా.. ఉత్సాహంగా ముందుకు కదలే వారు. కానీ.. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఒకింత ఊపు, ఉత్సాహం రెండూ తగ్గిపోయినట్టు తెలుస్తోంది.
తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల నుంచి పెద్దగా హడావుడి అయితే కనిపించ డం లేదు. ముఖ్యంగా టీడీపీ సభ్యులు గతంలో ఆందోళనకు దిగినప్పుడు.. లేదా నిరసన వ్యక్తం చేసిన ప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారిని నిలువరించేవారు. లేదా.. పోటాపోటీగా సభలో నినాదాలు.. నిరసనతో హోరెత్తించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పైగా, సభలోనూ సభ్యుల సంఖ్య దారుణంగా పడిపోయింది.
కొందరు ఎమ్మెల్యేలు.. సభకు వచ్చినా హాజరు వేయించుకున్నట్టుగా ఉండిపోయారు. మరికొందరు ముక్త సరిగా మాట్లాడారు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రసంగిస్తున్నప్పుడు కానీ.. దీనికి ముందు ఆయన ఎంట్రీ సమయంలో కానీ.. ఎవరూ పెద్దగా రియాక్ట్ కాకపోవడం గమనార్హం. గతంలో అయితే.. సీఎం జగన్ వస్తు న్నారంటే.. ఖచ్చితంగా ఎదురేగిన నాయకులు ఉన్నారు. చప్పట్లతో హడావుడి చేసిన వారు కూడా ఉన్నా రు. సో.. ఇప్పుడు ఆ వాతావరణం కూడా కనిపించలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో దీనికి కారణం.. పార్టీపై వారిలో ఉన్న అసంతృప్తేనా? లేక.. సీఎం జగన్పై అసంతృప్తా? అనేది ప్రశ్నగా మారింది. కొందరికి టికెట్లు లేకుండా చేయడం, ఎక్కువ మందిని సీట్లు మార్చడం వంటివి ప్రభావం చూపించాయనేది పరిశీలకుల అంచనా. ఇక, సభ చివరిది కావడం.. అందరూ కూడా.. పరిణామాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో పెద్దగా యాక్టివ్ నెస్ లేకుండానే సభకు హాజరయ్యాయి. ఇది.. అంతర్గతంగా ఎలా ఉన్నప్పటికీ బాహ్యంలో మాత్రం ఇబ్బందులు తప్పవనే సంకేతాలు పంపినట్టయిందని అంటున్నారు.