టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదురుతున్నట్లు తేలగానే వైసీపీ విమర్శల జోరు పెంచింది. గుంపులుగుంపులుగా వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
రజినీకాంత్ రేంజ్లో వైసీపీ నేతలు కొడుతున్న డైలాగులు విని జనం మాత్రం నవ్వుకుంటున్నారు. ఏపీలో జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు సీను కాలిపోతున్నా కూడా ఇంకా పెద్దపెద్ద మాటలు చెప్తున్నారని.. 175 సీట్లలో గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని జనం అంటున్నారు.
జగన్‌కు ఇంకా జనం నాడి అర్థం కాకపోయినా ఆ పార్టీ నాయకులకు మాత్రం అసలు విషయం తెలుసని.. తాము ఓడిపోతున్నామనితెలిసి కూడా జగన్ కోసం 175 సీట్లు అంటున్నారని జనం నవ్వుతున్నారు.
వైసీపీకి ఈ ఎన్నికలలో 50 సీట్లు రావడం కూడా కష్టమనే అభిప్రాయం జనం నుంచి వినిపిస్తోంది.
ఏపీలో రాజకీయ పరిస్థితులు, తాజా పొత్తులను జాగ్రత్తగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నారు.
జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు వారిలో కలుగుతున్న భయానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు ఖరారు కాగానే బీజేపీ-జనసేన-టీడీపీలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎన్నికల్లో ఓడిపోతామన్న వారి భయమే కనిపిస్తుందని అంటున్నారు.
మూడు పార్టీలు కలిసి వస్తే వైసీపీ మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుందని, అందుకే పొత్తును చూసి భయాందోళనలకు గురవుతూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారని, ఈ విమర్శల ద్వారా వైసీపీ.. మేకపోతు గాంభీర్యం కనబరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఖరారు చేయడంలో వైసీపీ ఆలస్యం చేయడానికి కూడా ఇదే కారణమని, అందుకు మచిలీపట్నం నియోజకవర్గం నిదర్శనమని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో బీజేపీ-జనసేన బలం పుంజుకోవడం, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం వైసీపీ నేతలను కలవరపెడుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల విషయంలో భారీ సంఖ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జాబ్ క్యాలెండ్ విడుద చేయకపోవడంపై నిరుద్యోగులు, జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, బిల్లుల అంశంపై కాంట్రాక్టర్లు కూడా వైసీపీకి వ్యతిరేకులుగా మారుతున్నారు. వాటన్నింటినీ గమనించే వైసీపీ నేతలు ఈ లేని ధైర్యాన్ని కనబరుస్తున్నారని, వైసీసీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడులు శూన్యంగా ఉన్నాయని, అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయని యువత ప్రశ్నిస్తుండటం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.