Farmers stopped actor #KanganaRanaut’s car near #Punjab's Ropar and protested against her over her statements on #FarmersProtest.
"If the police personnel were not present here, lynching would've happened, shame on these people," she says.
(ANI) pic.twitter.com/uKRp9RIvdK
— NDTV (@ndtv) December 3, 2021
పంజాబ్‌లోని కిరాత్పూర్ సాహిబ్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును ఆందోళనకారులు శుక్రవారం అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఈ వారం రద్దు చేసిన కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కంగనా పాలక బిజెపికి తీవ్రమైన మద్దతుదారు అని అందరికీ తెలిసిందే. ఒక సంవత్సరం నుంచి పోరాడుతున్న వేలాది మంది రైతులను తీవ్రవాదులు, ఖలిస్తానీలు మరియు “సామాజిక వ్యతిరేకులు” అని కంగన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
అనుకోకుండా ఈరోజు ఆమె రైతులున్న ప్రాంతం మీదుగా వెళ్తోంది. ఆమెకు వై కేటగిరీ భద్రత ఉన్న విషయం తెలిసిందే.
ఆమెకు పలువురు వ్యక్తులు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ఆమె కారును ఆపారు. ఆమె తెల్లటి కారును పెద్ద సంఖ్యలో రైతులు చుట్టుముట్టారు. చివరకు అతి కష్టం మీద పోలీసులు రైతుల నుంచి ఆమెను తప్పించి పంపించారు.