‘‘కరోనా వల్ల ప్రపంచమే అతలాకుతలం కాగా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సీఎం జగన్ హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడ్డారు. దేవాలయ భూముల రక్షణకు వ్యవస్థ రూపొందిస్తున్నారు. దీన్ని అందరూ అభినందించాలి. హైందవ మతానికి సీఎం విరుద్ధంగా ఉన్నట్లు గిట్టనివారంతా దుష్ప్రచారం చేస్తున్నారు’’
‘‘సీఎం జగన్మోహన్రెడ్డి హిందూమతం పట్ల విరుద్ధంగా ఉన్నారని కొందరు ఊరికే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం జరగడం పట్ల సీఎం జగన్ నా వద్ద దుఃఖం వ్యక్తం చేశారు. ఏ మతమైనా ఒక్కటేనన్న విధానంతో ఎవరి మనసూ నొప్పించకూడదన్నదే తన అభిమతమని సీఎం చెప్పారు’’
‘‘హిందూ ధర్మం హిందూ మతానికి సంబంధించి కొన్ని విషయాలపై నేను చేసిన సూచనలను సీఎం జగన్ శ్రద్ధగా ఆలకించారు. ఆలయాల్లో చోటు చేసుకునే లోపాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిచేస్తోంది’’
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విలువైన గంట సమయాన్ని అవధూత దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంత స్వామీజీని కలవటం.. ఆయనతో భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భాన్ని ఉద్దేశించి సీఎంజగన్ ను ఉద్దేశించి స్వాములోరు బోలెడన్ని మాటలు చెప్పారు.
తన వద్దకు వచ్చి.. తన మీద ప్రేమాభిమానాలు ప్రదర్శించిన సీఎం విషయంలో.. తాత్విక చింతన మాత్రమే ఉండే స్వాములోరు సగటు రాజకీయ నేతలా పొగడటాన్ని తప్పు పట్టలేదు. ఎందుకంటే.. నడుస్తున్నది కలియుగం కదా? కాలం ఇలానే ఉంటుంది.
ఇదంతా బాగానే ఉన్నా.. తన మాటల్లో సీఎం జగన్ కు ‘హిందువు’ అనే పదాన్ని పదే పదే జోడించటం ఎందుకంటారా? అలా జోడించాల్సిన అవసరం ఏమిటి? అంటే.. స్వామిజీ సీఎం జగన్ హిందువు కాదన్న భావనలో ఉన్నారా?
సాధారణంగా రాజకీయ నేతలు ఎన్నికల వేళలో.. మైనార్టీలకు తాము ఎంత సన్నిహితమన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. పదే పదే మైనార్టీ రాగాన్ని ఆలపిస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో.. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా బహిరంగ రహస్యమే. మరి.. అదే రీతిలో స్వామి వారి నోటి నుంచి అదే పనిగా సీఎం గారి ప్రస్తావనతో పాటు.. ‘హిందువు’ అన్న పదాన్ని అంతలా నొక్కి చెప్పాల్సిన అవసరం ఎందుకంటారు?
తెలుగు ప్రజలందరినీ ఈ రెండు ప్రశ్నలు వేధిస్తున్నాయి.
No.1 doubt
జగన్ హిందువు అయితే, ఆయన భార్యతో పాాటు తిరుమలకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎందుకు రావడం లేదు ?
No.2 doubt
జగన్ హిందువు అయితే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జెరూసలెంకు కుటుంబ సమేతంగా ఎందుకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు? అలా ఏ హిందువు కూడా వెళ్లరే?
మరి సామాన్యులు అడుగుతున్న ఈ రెండు ప్రశ్నలకు స్వామీజీ సమాధానం చెబుతారా? జగన్ రెడ్డి సమాధానం చెబుతారా?