వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రోజా.. చాలా తక్కువ సమయంలోనే ఫ్రైర్ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ హయాంలో మంత్రి కూడా పని చేసిన రోజా.. 2024 ఎన్నికల్లో ఘోర పరాజాయన్ని మూటగట్టుకున్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం రోజా మీడియా ముందుకు రావడం మానేశారు. ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో.. రోజా మళ్లీ టీవీ షోలు, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రోజా వెకేషన్ కు వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఇటలీ దేశంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్ మోడ్ లో ఉన్న రోజా ఫోటో ఒకటి బయటకు రాగా.. అది చూసి నెటిజన్లు షాకైపోతున్నారు.
మోకాళ్లపైకి ఉండే పొట్టి డ్రెస్సులో రోజా దర్శనమిచ్చింది. ఒకప్పుడు ఆడపడుచులకు చీరే అందం, చీరలో మాత్రమే ఉండాలంటూ ప్రత్యర్థులకు నీతులు చెప్పిన రోజా.. ఇప్పుడిలా విదేశీ పర్యటనలో షార్ట్ డ్రెస్ వేసి ట్రోలర్స్ కు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజా డ్రెస్సుపైనే చర్చలు సాగుతున్నాయి. నీతులు చెప్పడం కాదు.. పాటించాలి కూడా అంటూ రోజాపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.