ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అనాలోచిత నిర్ణయాలపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. జగన్ పాలనలో తాము కూడా అమ్మో ఒకటో తారీకు అనే రీతిలో జీతాల కోసం ప్రతినెలా 5 నుంచి 20వ తారీకు వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఏపీ సర్కార్ జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇక, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితైతే మరింత దయనీయంగా మారింది. అధికారంలోకి రాగానే అర్హతలను బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్….మూడేళ్లు గడిచినా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పర్మినెంట్ సంగతి దేవుడెరుగు…ఒక్క రూపాయి జీతం కూడా పెరగలేదు. దీంతో, తాజాగా ఏపీలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు జగన్ పై వార్ డిక్లేర్ చేశారు.
అక్టోబర్ 20లోగా తమ జీతాలు పెంచి తమ డిమాండ్లు నెరవేర్చకుంటే పోరుబాట పడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సమావేశంలో జగన్, వైసీపీ ప్రభుత్వంపై కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎండ, వానా, చలి, రాత్రి, పగలు అనక తాము కూడా రెగ్యులర్ ఉద్యోగులతోపాటుగా పనిచేస్తున్నామని, కరెంటు తీగలపై తమ ప్రాణాలు పోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ఉద్యమాన్ని పోలీసులను అడ్డుపెట్టకొని అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని, విద్యుత్ సౌధను ముట్టడించి తమ డిమాండ్లు నెరవేరే వరకు అక్కడే నిరసన చేపడతామని హెచ్చరించారు. లాఠీలు విరిగినా సరే తాము బెదిరేది లేదని, పోలీసుల లాఠీలు ఏమీ పీకలేవని, ఎంతమందిపై పోలీసులను ప్రయోగించి ఇబ్బంది పెడతారో తామూ చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము కాంట్రాక్ట్ ఉద్యోగులమైనా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి తమ కుటుంబంలోని వారికి అమ్మఒడి, పెన్షన్ వంటి పథకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో జీతాలు పెంచారని, జగన్ వచ్చి మూడేళ్లయినా ఒక్క రూపాయి జీతం పెరగలేదని గుర్తు చేసుకున్నారు. అవకాశమున్నంతలో చంద్రబాబు తమకు న్యాయం చేశారని, కానీ, జగన్ మాత్రం హామీఇచ్చి కూడా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తాము అడిగే డిమాండ్లు న్యాయమైనవని, వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా ఆ ఉద్యోగి ఇచ్చిన స్పీచ్ వీడియో వైరల్ అయింది.
నీ పోలీసులు వాళ్ళ లాఠీలు మిమ్మల్ని ఏం పీకలేవు. జగన్ ప్రభుత్వానికి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు షాక్. ప్రసంగం అదుర్స్ ???? (1/2) pic.twitter.com/5xaZyVWIFt
— మన ప్రకాశం (@mana_Prakasam) August 4, 2022
Comments 1