వైసీపీ అధినేత, సీఎం జగన్ వచ్చే ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనదే విజయం రాసిపెట్టుకోం డి.. అని చెబుతున్నారు. అంతేకాదు.. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం .. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మన పక్షానే నిలుస్తారని.. కూడా ఆయన చెబుతున్నారు. అయితే.. ఆయన చెబుతున్న ట్టుగా.. పార్టీలో నేతలకు మాత్రం భరోసా లేకుండా పోయింది. ఎందుకంటే.. ప్రస్తుతం జగన్ ఆదేశాల మేరకు.. నాయకులు గడప గడపకు తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు.
ఈ సమయంలో ప్రజల నుంచి వస్తున్న అనేక విమర్శలు.. వివాదాలు.. నాయకులకు తలనొప్పిగా మారా యి. దీనిని గమనిస్తే.. జగన్ చెబుతున్నట్టుగా పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని .. వారు కుండ బద్దలు కొడుతున్నారు.
అంతేకాదు.. ఎక్కడికక్కడ వ్యతిరేకత వస్తోందని కూడా అంటున్నారు. “పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేకత నివును గప్పిన నిప్పులాగా ఉంది. ఎక్కడా అభివృద్ధి లేదనే టాక్ వినిపిస్తోంది. “ అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఇక, పార్టీకి ఉన్న కేడర్ విషయంలోనూ నాయకులకు సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అయితే.. కేడర్ ఉత్సాహంగా పనిచేశారు. ఎక్కడికక్కడ నాయకులకన్నా కూడా కార్యకర్తలు ముందుకు కదిలారు. మేమున్నామంటూ.. పార్టీనిబలోపేతం చేశారు. ప్రజలతో మమేకం అయ్యారు.
`జగనన్నకు ఒక్క ఛాన్స్` అంటూ.. వారే ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కార్యకర్తలు పార్టీ విషయంలో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. పార్టీఅ ధికారంలోకి వచ్చినా.. తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు.
ఇక, ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. సగంమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో తమ వద్దకు ఓట్లకు వచ్చారని.. కానీ, ఇప్పటి వరకు కనీసం కనిపించలేదని ప్రజలు తిట్టిపోస్తున్నారు. తాజాగా పెనుకొండలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ.. పోనీ.. వలంటీర్ వ్యవస్థ ఏమైనా కాపాడుతుందా? అంటే.. దానికి ఎన్నికల సంఘం కళ్లెం వేసింది.
దీంతో వలంటీర్లు ఏమీ చేయలేరు. ఇలా,… ఏ కోణంలో చూసుకున్నా.. వైసీపీ ఎదురుగాలి ఎదుర్కొనడం ఖాయమని నాయకులు తల్లడిల్లుతున్నారు. పోనీ.జగన్ చెబుతున్నట్టు సంక్షేమం ఏమైనా ఆదుకుంటుందా? అంటే.. ఇది సమాజంలో కేవలం5 శాతం మందికి మాత్రమే అందుతోంది. వీరిలో ఎంత మంది వచ్చి ఓటేస్తారు? అనేది సందేహం. ఇలా.. వైసీపీ నాయకులు తల్లడిల్లుతున్నారు. మరి జగన్ వీరిలో భరోసా ఎలా కల్పిస్తారో చూడాలి.