రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అయితే.. దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. అయితే.. ఏపీలో అన్ని పార్టీలదీ ఇప్పుడు ఒకే దారి అయిపోయింది. వ్యక్తిగత విమర్శలు, దూషణలు.. ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం కామన్ సబ్జెక్టుగా మారిపోయింది. సాధారణ రోజుల్లో ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ. ఎన్నికల సమయంలో మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో నాయకులు, పార్టీలు కూడా కొన్ని హద్దులను పెట్టుకోవాల్సిందే. లేకపోతే.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొరడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇది కొన్నికొన్ని సార్లు అభ్యర్థులను పోటీ నుంచి తప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. సాక్షత్తూ సీఎం జగన్ పైనే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
విపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబుపై “మేమంతా సిద్ధం“ సభల్లో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ చేసిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించింది. ఇలా చేయడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నిక లసంఘం స్పష్టం చేసింది. “ఈ విషయం మీకు తెలియదా? తెలిసి కూడా చేశారా? ఎందుకు ఇలా వ్యవహరించారు? దీనికి 48 గంటల్లో పూర్తిస్థాయిలో వివరణ(అంశాల వారీగా) ఇవ్వండి“ అంటూ.. సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల అధికారుల ద్వారా ఈసీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. అలా ఇవ్వకపోతే.. చర్యలు తప్పవని కూడా మెచ్చరించింది.
ఎన్నికల సంఘం పేర్కొన్న అంశాలు..
పశుపతి: చంద్రబాబును అరుంధతి సినిమాలో విలన్ పశుపతితో పోల్చుతూ.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదమైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.
శాడిస్టు: చంద్రబాబును జగన్ శాడిస్టుతో పోల్చారు. వలంటీర్లను తీసేసి.. పింఛను దారులను వేధిస్తూ.. ఆనందం పొందుతున్న శాసిట్టు అని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని పేర్కొంటూ.. నోటీసులో తీవ్రంగా హెచ్చరించింది.
మోసగాడు: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. మేనిఫెస్టోను మాయ చేసిన మోసగాడు చంద్రబాబు-అని జగన్ వ్యాఖ్యానించడంపైనా ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
కలికాలం: పింఛన్ల కోసం వచ్చి ఎండలో నిలబడలేక 31 మంది చనిపోయారు. దీనికి కారణం చంద్రబాబు. ఇది కలికాలం కాక మరేమిటి. వీరంతా కలికాలపు చిహ్నాలు- అని జగన్ అన్నారు. దీనికి వివరణ కోరుతూ ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.
చంద్రముఖి: చంద్రబాబు అనే చంద్రముఖి.. లకలకలక అంటూ మళ్లీ ఓట్ల కోసం ముందుకు వచ్చింది – అని జగన్ అన్నారు. దీనిపైనా ఈసీ సీరియస్ అయింది. వివరణ కోరింది.