వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి ఇప్పటికే డోలాయమానంలో పడిపోయింది. ఎన్నికల తర్వాత .. ఆయన గ్రాఫ్ చాలా వరకు డౌన్ అయింది. ఇక, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం తెరమీ దికి వచ్చాక మరింత డౌన్ ట్రెండ్ నడిచింది. ఇదిలావుంటే..పార్టీ నుంచి కీలక నాయకులు జంప్ చేయ డంతోపాటు.. మరింత మంది కూడా రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత పరిస్థితి ఇబ్బందిగా మారింది.
ఇప్పుడు జగన్ .. తనను తాను నిలబెట్టుకోవడంతోపాటు పార్టీ పరువును కూడా కాపాడుకునేందుకు నానా ప్రయాస పడుతున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీలుగా ఉన్న నాయకులు.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చేతనైతే.. పార్టీకి, పార్టీ అధినేతకు సాయంగా ఉండాలి. లేకపోతే.. తమ పని తాము చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగింది చాలని సైలెంట్ గా అయినా ఉండాలి. కానీ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నారు.
గత రెండు నెలలుగా ఆయన లవ్ ఎఫైర్ బాహ్య ప్రపంచానికి కూడా తెలిసి.. నవ్వుల పాలైనా తీరు మార్చు కోవడం లేదు. కట్టుకున్న భార్య, పెళ్లీడుకు వస్తున్న ఆడపిల్లులను పెట్టుకుని.. ఇలా చేయడం ఏంటని సభ్య సమాజం నవ్వుతున్నా దువ్వాడ మాత్రం దర్జాగా ఉన్నారు. తన ప్రేమాయణాన్ని ఎలాంటి పరువు నష్టం కింద చూడకుండా.. ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనివల్ల ఆయనకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఎలా ఉన్నా.. వైసీపీకి మాత్రం భారీ డ్యామేజీ ఏర్పడుతోంది.
తాజాగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఎక్కడెక్కడ నుంచో లక్షల మంది భక్తులు వస్తారు. వీరి మధ్య తన ప్రేమికురాలిని వెంటేసుకుని దర్శనానికి వెళ్లారు.. దువ్వాడ. అంతేకాదు.. ప్రొటోకాల్ ప్రకారం దర్శనం చేసుకున్నానని.. మీడియాకు సగర్వంగా చెప్పుకొచ్చారు. సాధారణంగా తిరుమల వంటి పవిత్ర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కట్టుకున్న ధర్మ పత్నితో వెళ్తారు. లేకపోతే.. ఒంటరిగా అయినా వెళ్తారు.
కానీ, ఇలా వివాహేతర సంబంధం పెట్టుకున్న వారిని దర్జాగా.. ప్రొటోకాల్ దర్శనాలకు తీసుకువెళ్లడం, మీడియాకు ఫోజులు ఇవ్వడం వంటివి దువ్వాడ దురాగతానికి ప్రతీక. ఆయనకు ఇది బాగానే ఉన్నా.. వైసీపీని, జగన్ను మరింత డ్యామేజీ చేస్తున్నాయి. ఇప్పటికే లడ్డూ ప్రసాదం రగడ నుంచి బయట పడలేదు.ఇ ప్పుడు దువ్వాడ వ్యవహారం!! ఇదీ.. సంగతి..!