దుబాయ్లో నిర్మిస్తున్న పెద్ద, విశాలమైన హిందూ దేవాలయం శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం పూర్తయిన విషయం తెలిసిందే. తెలుగు ఎన్నారైలు అరేబియా ఎడారులలో తమ “ఇలవేల్పు”ను చూసి ఆనందించి పరవశించే రోజులు వచ్చేశాయి. నేటి నుంచి దుబాయ్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు వెంకటేశ్వరస్వామి దర్శనం ఇవ్వనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్నారైలు ఆదివారం నుంచి దుబాయి నగరంలో దర్శనం చేసుకోవచ్చు. దుబాయిలోని జబల్ అలీలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ పూర్తయింది. పూర్తి ఆగమ శాస్త్ర ఆచారాలతో అత్యంత సుందరంగా నిర్మించారు ఆలయం.
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు దర్శనాలకు అనుమతి ఇస్తారు. ప్రస్తుతానికి స్వామి వారికి భక్తులు ఎలాంటి ధూప దీప నైవేద్యాలు సమర్పించడానికి అవకాశం లేదు. అక్టోబరులో దేవాలయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీంతో అక్టోబరు 4 నుంచి భక్తులు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా నేరుగా దేవాలయాన్ని దర్శించవచ్చు. 1947కు పూర్వం నుంచి దుబాయిలో నివసిస్తున్న సింధీ వ్యాపారస్తులతో కూడిన సింధీ గురు దర్బార్ మందిర నిర్వహణ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మించింది.
Visited Dubai temple today which opens for visitors starting today.
Jai Shiv Shambhoo pic.twitter.com/udgz7J8pHb
— Sameer Sharma ????☀️???????????????? (@sameersharmaa) September 1, 2022