ఏపీలో కరోనాకు సామాన్యులే కాదు ప్రముఖులు కూడా బలవుతున్నారు. బీజేపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు, తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మరిణించిన విషయం మరవనే లేదు అపుడే కరోనా మరో కీలక నేతను బలితీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తాజాగా కన్నుమూశారు. నెల రోజుల కిత్రం కరోనా బారిన పడ్డ ద్రోణంరాజు శ్రీనివాస్… కోలుకున్నాక మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. కరోనా లక్షణాలు తీవ్రం అయ్యాయి. అవి ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆయన కన్ను మూశారు.
ద్రోణంరాజు శ్రీనివాస్ కుటంబం తండ్రి నేనుంచే రాజకీయ కుటుంబం. ఏపీలో పేరొందిన రాజకీయ కుటుంబాల్లో ఒకటి. ఆయన తండ్రి కాంగ్రెస్ దివంగత నేత, మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ. శ్రీనివాస్ కూడా సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ విప్.
వైఎస్ హయాంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు సార్లు (2004, 2009) ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ చేతిలో ద్రోణంరాజు శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు.
అయినా జగన్ ఆయనకు మంచి పదవి ఇచ్చారు. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎండీఆర్ఏ) చైర్మన్ గా నియమించారు. అంతలో ఆయన దూరమయ్యారు. ఈయనపై గెలిచిన గణేష్ ఇటీవలే వైసీపీలో చేరారు.
ఏపీలో కరోనా : ఇప్పటి వరకు ఆంధ్రాలో 713014 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 651791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5941 మంది మరణించారు.